నటి ఆకాంక్ష పూరి చేసిన పని ఇండియా వైడ్ సంచలనం రేపింది. బిగ్ బాస్ హౌస్లో ఆమె మేల్ కంటెస్టెంట్ కి లిప్ కిస్ ఇవ్వగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై ఆమె స్పందించారు.
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రసారం అవుతుంది. ఈ షోలో కంటెస్టెంట్ ఆకాంక్ష పూరి మేల్ కంటెస్టెంట్ జైద్ కి లిప్ కిస్ ఇచ్చారు. కెమెరాల ముందు ముద్దుల్లో మునిగిపోయిన ఈ జంటపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆకాంక్ష పూరిని సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేశారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా... ఆమె షో నుండి తప్పించారు.
26
ఈ ఆదివారం ఆకాంక్ష ఎలిమినేట్ అయ్యారు. ఆమెపై హోస్ట్ సల్మాన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ నుండి బయటకు వచ్చిన ఆకాంక్ష వివరణ ఇచ్చారు. ఆమె తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.
36
ఆకాంక్ష మాట్లాడుతూ... జైద్ కి ముద్దు నేను టాస్క్ లో భాగంగా ఇచ్చాను. షోలో టాస్క్ లు పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఓ 30 సెకన్ల టాస్క్ లో భాగంగా జైద్ కి ముద్దుపెట్టాను. దాన్ని నేను టాస్క్ గానే చూశాను. ఇందులో నా తప్పేమీ లేదన్నారు. ఆ స్థానంలో జైద్ కాకుండా ఎవరున్నా ముద్దు పెట్టేదాన్ని, అన్నారు.
46
జైద్ కి ముద్దిచ్చే సమయంలో నా మనసులో ఏం లేదు. అలాగే లిప్ కిస్ ఇవ్వడం ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. సల్మాన్ ఖాన్ కోప్పడతారని కూడా నేను భావించలేదు. వ్యక్తిగతంగా జైద్ కి ముద్దుపేట్టాలనే ఆసక్తి నీకు ఏమాత్రం లేదు. అది టాస్క్ లో భాగంగా జరిగిపోయిందన్నారు. ఈ వారం ఆకాంక్ష ముద్దుపెట్టిన జైద్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదు.
56
akanksha puri songs
ఇక బిగ్ బాస్ షోపై ఎప్పటి నుండో వ్యతిరేకత ఉంది. భారతీయ సాంప్రదాయాలు విరుద్ధంగా ఉన్న ఈ షో బ్యాన్ చేయాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. విదేశాల్లో బిగ్ బ్రదర్ అని ప్రసారమైన ఈ రియాలిటీ షో ఇండియాలో బిగ్ బాస్ షోగా ప్రాచుర్యం పొందింది. మొదట హిందీలో తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది.
66
కాగా ఆకాంక్ష సౌత్ ఇండియాలో పలు చిత్రాలు చేశారు. విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీలో ఆకాంక్ష ఓ రోల్ చేశారు. ఈమె ప్రొఫెషనల్ సింగర్ కూడా. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. లిప్ లాక్ మేటర్ తో ఆమె పేరు ఇండియా వైడ్ వినిపించింది.