
దళపతి విజయ్.. తమిళనాట సంచలనం సృష్టించారు. తమిళనాడు-2026 ఎన్నికల ఫలితాల్లో తన టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆయన ఏకంగా 108సీట్లు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్‌కి ఇంకా పది సీట్లు తక్కువగా వచ్చినా, విజయ్ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంది. అధికారం దక్కించుకోబోతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఈ స్థాయిలో సీట్లు గెలవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. దేశంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా, దానిపై చర్చలేదు. అంతా విజయ్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఆయన ఇప్పుడు ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారారు.
మరి విజయ్ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? ఆయనకు రాజకీయ ఆలోచనకు బీజం పడ్డ సందర్భమేంటి? అనేది చూస్తే, చాలా చిన్న కారణం ఉంది. అయితే విజయ్‌కి మాత్రం అది చాలా ప్రస్టీజియస్ ఇష్యూ. ఆయనకు ఒక పెళ్లిలో జరిగిన అవమానమే కారణమని టాక్. కొన్నాళ్ల క్రితం ఒక ప్రముఖ నిర్మాత కొడుకు వివాహం జరిగింది. ఆ పెళ్లికి దళపతి విజయ్‌తోపాటు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. సీఎంగా ఉన్న స్టాలిన్ కూడా వచ్చారు. ఈవెంట్ హాల్‌లో ముందుగా విజయ్ వెళ్తున్నారట. ఆ తర్వాత సీఎం వచ్చారు. సీఎం సెక్యూరిటీ.. విజయ్ ఒక సూపర్ స్టార్ అని కూడా చూడకుండా ఆయన్ని సైడ్ చేశారట. కామన్‌గా సీఎం వస్తున్నారంటే సెక్యూరిటీ సీఎంకి రౌండ్‌గా ఉంటారు, ఎవరినీ రానివ్వరు, ఆ పరిధిలో ఉండనివ్వరు.
అలానే సీఎం స్టాలిన్ వస్తుంటే.. విజయ్ ని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు మూవ్ చేశారు. ఒక కామన్ మ్యాన్ లాగానే ట్రీట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ని.. స్టాలిన్ కూడా చూశారట. కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్లిపోయారట. ఒక పెద్ద స్టార్ ఎదురుపడితే, సీఎం అయినా, పీఎం అయినా విష్ చేసి, షేక్ హ్యాండ్ ఇచ్చి, వెళ్తుంటారు. బేసిక్ రెస్పెక్ట్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ విజయ్‌కి అది మిస్ అయ్యింది. దాన్ని విజయ్ అవమానంగా ఫీలయ్యారట. తానేంటో చూపించాలనే ఆలోచన అప్పుడే వచ్చిందట. ఓ రకంగా తాను రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనకు బీజం పడింది అక్కడే అని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలానే చిన్నప్పట్నుంచి ఆయన చాలా అవమానాలు ఫేస్ చేశారట. కులానికి సంబంధించి, మతానికి సంబంధించిన అవమానాలు కూడా ఫేస్ చేశారట. ఇవన్నీ ఆయనలో గుడుకట్టుకున్నాయని అంటుంటారు.
దీనికితోడు విజయ్ సినిమాల విడుదలకు అడ్డంకులు. విజయ్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు విడుదల విషయంలో ప్రభుత్వాలు అడ్డుంకులు సృష్టించాయి. పొలిటికల్ డైలాగ్‌లు, రాజకీయ విమర్శలు ఉండటం, సినిమాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే, వారి తప్పులను ఎత్తిచూపే సీన్లు ఉండటంతో విడుదలకు అడ్డంకులు సృష్టించారు. మొన్న `జననాయకుడు` విషయంలోనే కాదు `సర్కార్, మెర్సల్, తలైవా ఇలా చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. దీంతో విజయ్‌కి అక్కడే మండిందట. రాజకీయ లెక్కలేంటో తేల్చుకోవాలనుకున్నారట. దీనికితో ఇటీవల `జననాయకుడు` సినిమాని విడుదలను ఆపేశారు. పొలిటికల్ డైలాగ్‌లు ఉండటంతోనే దీన్ని అడ్డుకున్నారు. ఈ మూవీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇది కూడా సీఎం స్టాలిన్ కొంపముంచిందట. సినిమా విషయంలో ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టడం స్టాలిన్‌కి మైనస్‌గా మారింది. విజయ్‌కి ప్లస్ అయ్యింది. అది ఏకంగా సీఎం పీఠం దక్కేలా చేసింది. స్టాలిన్‌కి సీఎం పీఠం ఊడేలా చేసింది.
మరోవైపు తమిళనాడులో ఇటీవల ఏ హీరో సినిమాలు చేసినా సన్ పిక్చర్స్ తోనో, లేదంటే ఉదయనిధి స్టాలిన్ పెట్టిన రెడ్ జాయింట్ ప్రొడక్షన్స్ తోనూ టై అప్ కావాల్సి ఉంటుందట. విడుదల విషయంలో అయినా, రిలీజ్ రైట్స్, ప్రొడక్షన్‌లో భాగం కావడం, ఓటీటీ వంటి విషయాల్లో వారితో కలవాలనే నిబంధన ఉందట. విజయ్ హీరోగా వచ్చిన చిత్రాల విషయంలోనూ ఇదే నిబంధన వర్తించిందట. దీంతో ఇది కూడా విజయ్‌కి మండటానికి కారణమైందని, రాజకీయంగా తాడో పేడో తేల్చుకోవాలనే ఆలోచన వచ్చిందని సమాచారం. ఇలా తనకు జరిగిన అవమానం కారణంగా విజయ్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనకు వచ్చారని, ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఏకంగా సీఎం పదవిని చేపట్టబోతున్నారని అంటున్నారు. ఏదేమైనా, కారణాలేమైనా.. విజయ్ తమళ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా చెప్పొచ్చు. సరికొత్త చరిత్ర కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.