పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఫ్యాన్స్ కి ఒక మెమొరబుల్ మూవీ. ఈ చిత్రంలో రానా కూడా అదరగొట్టేశాడు. ఈ మూవీలో పవన్ పోలీస్ అధికారిగా నటించగా.. రానా మాజీ ఎంపీ తనయుడిగా నటించాడు.
ఇద్దరి ఫేస్ ఆఫ్ ఈ చిత్రంలో అదిరిపోయింది. అయితే ఈ మూవీలో పవన్ పక్కన లేడీ పోలీస్ గా నటించిన మౌనిక రెడ్డి గుర్తుందిగా. ఈ చిత్రంలో మౌనిక రెడ్డి కీలక పాత్రలో నటించింది. భీమ్లా నాయక్ చిత్రంతో పాటు సూర్య లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది.
భీమ్లా నాయక్ చిత్రంలో మౌనిక రెడ్డి ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. అయితే మౌనిక గత కొంత కాలంగా సందీప్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. గత ఏడాది వీరిద్దరూ గోవాలో వివాహం కూడా చేసుకున్నారు.
అయితే పెళ్ళై ఏడాది కూడా గడవకముందే ఈ జంట విడాకుల దిశగా పయనిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ ని బలపరిచే విధంగా మౌనిక రెడ్డి తన సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న ఫొటోస్, పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేసింది. వీరిద్దరి మద్య మనస్పర్థలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా తన భర్త సందీప్ ని కూడా ఇన్స్టా లో అన్ ఫాలో చేసింది. దీనితో మౌనిక సందీప్ జంట విడిపోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
సోషల్ మీడియాలో మౌనిక రెడ్డి క్రేజీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మౌనిక రెడ్డి అచ్చతెలుగు అమ్మాయి. తెనాలిలో పుట్టి పెరిగింది. 28 ఏళ్ల మౌనిక ఇప్పుడిపుడే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు అందుకుంటోంది.