మరోవైపు ఇద్దరికి మాట ఇచ్చాను పెళ్లికూతురు ఒక్కతే, కిరణ్ కి ఇచ్చి పెళ్లిచేయాలా ప్రేమించిన గౌతమ్ కి ఇచ్చి పెళ్లి చేయాలా అని ఆలోచనలో పడతాడు మురారి. గదిలోకి వచ్చిన కృష్ణ ఆలోచనలో ఉన్న భర్తని చూసి నా వల్లే ఈ పరిస్థితి అని బాధపడుతుంది. భర్త దగ్గరికి వచ్చి రేపు మధ్యాహ్నానికి మీకు ఈ సంఘర్షణ ఉండదు, ఆ భారాన్ని నేను తీసుకుంటాను.మీ పెద్దమ్మ వల్ల వచ్చే ఏ సమస్య నైనా నేను మా భుజాల మీద వేసుకుంటాను అంటుంది కృష్ణ. అదంతా తేలికైన విషయం కాదు, ఇంటికి ప్రతిష్ట తెచ్చావు అంటూ పెద్దమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసా అంటాడు మురారి.