Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?

Published : Dec 11, 2025, 07:55 AM IST

Bayilone Ballipalike Song : సోషల్ మీడియాను ఊపుఊపేస్తోంది 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్. ఫేమస్ ఫోక్ సింగర్ మంగ్లీ ఆడి పాడిన ఈ పాటకు రెస్పాన్ మామూలుగా రావడంలేదు.. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. రచ్చ రచ్చ చేస్తున్న ఈ సాంగ్ ఎన్ని వ్యూస్ సాధించిందంటే? 

PREV
15
జానపదాలకు మంచి ఆదరణ..

సినిమా పాటలతో పాటు మన తెలుగు శ్రోతలు జానపదాలను కూడా బాగా ఆదరిస్తుంటారు. ఈక్రమంలోనే ఎన్నో ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాయి. మొన్నటి వరకూ.. రాము రాథోడ్ ఆడి పాడిన.. రాను ముంబయికి రాను సాంగ్ ఎంత రచ్చ చేసింతో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ క్రేజ్ వల్లే అతను బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగు పెట్టాడు. ఇక ఈ కోవలోనే మంగ్లీ పాటలకు మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ప్రతీ పండగకీ ఆమె రిలీజ్ చేసే సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తెలుగుతో పాటు కన్నడ ప్రేక్షక్షుల్లో కూడా మంగ్లీకి మంచి క్రేజ్ ఉంది. దాంతో ఆమె పాటలకు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. ఇప్పటికే మంగ్లీ పాడిన ఎన్నో పాటలు ట్రెండింగ్ లోకి వచ్చి.. కోట్లలో వ్యూస్ ను రాబట్టగా.. ప్రస్తుతం బాయిలోనే సాంగ్ అంతకు మించి సాధిస్తోంది.

25
ట్రెండింగ్ లో బాయిలోనే బల్లిపలికే సాంగ్

ప్రస్తుతం ఎక్కడ విన్నా... ఏ కార్యక్రమంలో చూసినా.. ఒక్కటే సాంగ్ ట్రెండ్ అవుతోంది. చిన్నా.. పెద్దా అందరి స్వరంలో ఒక్కటే పాట నానుతోంది. ప్రతీ ఒక్కరు.. లిరిక్స్ గుర్తున్నా లేకపోయినా.. హమ్ చేస్తున్న ఆ పాట మరేదో కాదు ఫేమస్ సింగర్ మంగ్లీ పాడిన 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్. నెట్టింట దుమ్ముదుమారం రేపుతోన్న ఈ పాటను సోషల్ మీడియాలో రకరకాలుగా వాడేస్తున్నారు జనాలు. ఇక ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్ అయితే.. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను కూడా రాబడుతోంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ ను రాబడుతూ.. కోట్ల వ్యూస్ తో పరిగెడుతోంది.

35
రీల్స్ లో రచ్చ రచ్చ చేస్తున్న మంగ్లీ సాంగ్

ఈమధ్య కాలంలో ఇన్ స్టార లో కానీ..యూట్యూబ్ లో కానీ.. ఏ రీల్ చూసినా... ఈ ఫోక్ సాంగ్ ట్రెండ్ అవుతూ వస్తోంది. అసలు చెప్పాలంటే.. పూర్తి పాట రిలీజ్ కాకముందు నుంచే.. జస్ట్ టీజర్ సాంగ్ నుంచే ఈ మ్యుజిక్ తో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇక ఫుల్ సాంగ్ వచ్చిన తరువాత ప్రస్తుతం రెచ్చిపోతున్నారు. ఈసాంగ్ తో రకరకాల ప్రయోగాలు చేస్తూ.. రీ క్రియేట్ కూడా చేసేస్తున్నారు. ఏదైనా రీల్ ను స్క్రోల్ చేద్దామంటే.. పది రీల్స్ లో.. దాదాపు 7 రీల్స్ కు బ్యాక్ గ్రౌండ్ లో.. బాయిలోనే బల్లిపలికే సాంగ్ వినిపిస్తోంది. ఈక్రేజ్ తోనే యూట్యూబ్ లో ఈ సాంగ్ దూసుకుపోతోంది.

45
3 కోట్ల వ్యూస్ కు దగ్గరగా

సింగర్ మంగ్లీ ఫుల్ జోష్‌తో పాడిన బాయిలోనే 'బల్లి పలికే' సాంగ్ రచ్చ రచ్చ చేస్తోంది. మూడు రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ ను దాటేసిన ఈ పాట.. ప్రస్తుతం 3 కోట్ల వ్యూస్ కు అతి దగ్గరలో ఉంది. 2 కోట్ల 95 లక్షల వ్యూస్ ను దాటేసిన ఈ పాట.. 10 రోజులు పూర్తవ్వకముందే 3 కోట్ల వ్యూస్ మార్క్ ను దాటబోతోంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పాట ట్రెండ్ అవుతోంది. నాగవ్వతో కలిసి మంగ్లీ పాడిన ఈ పాటను కమల్ ఎస్లావత్ రాయగా.. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. వాయిస్ లో బేస్ తో, ఎనర్జీ, స్టెప్పులతో మంగ్లీ తనదైన మ్యాజిక్ చేయగా..మధ్య మధ్యలో నాగవ్వ వాయిస్ వినిపిస్తూ.. గూస్ బాంప్స్ తెప్పిస్తుంది . 2025 లో రిలీజ్ అయిన సాంగ్స్ లో బ్లాస్టింగ్ సాంగ్ గా బాయిలోనే బల్లిపలికే నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక న్యూ ఇయర్ పార్టీలలో మంగ్లీ సాంగ్ మారుమోగబోతుంది. ఈ లెక్కన న్యూ ఇయర్, సంక్రాంతి టైమ్ లో ప్రతీ ఇంట్లో, ప్రతీ పార్టీలో ఈ సాంగ్ మోగితే.. రికార్డు స్థాయిలో వ్యూస్ పెరగడం ఖాయం.

55
బాయిలోనే బల్లిపలికే సాంగ్ పల్లవి

ఆకాశవాణి మంగ్లీ జనరంజక కార్యక్రమం...

బాయిలోనే బల్లి పలికే... బాయిలోనే బల్లి పలికే...

బండసారం శిలలొదిలే బాయిలోనే...

బాయిలోనే బల్లి పలికే... బాయిలోనే బల్లి పలికే..

బండసారం శిలలొదిలే బాయిలోనే...

ఎర్రానీ మావోళ్ల చేతికి... ఎర్రానీ మావోళ్ల చేతికీ...

ఏడు వేళ్ల జోడుంగురాలో ఎర్రానీ...

గుండు గున్నాలు... ఆసెంపషర్లు ఇంపుగా సింగారించుకుని...

సన్నా సన్నాని జాజులు సందేళ మోజుగా ముడుసుకోనొస్తినీ...

బాయి బాటెంట బంతిపువ్ తోటెంట పిలగా నీ తోడు సిద్ధమై వస్తిరా... బాయిలోనే...

బాయిలోనే బల్లి పలికే... బాయిలోనే బల్లి పలికే...

బండసారం శిలలొదిలే బాయిలోనే...

బాజరుల బల్లలంతా... బాజరుల బల్లలంతా బత్తీసా లాడంగో బాజరులా...

Read more Photos on
click me!

Recommended Stories