Fact: విజయశాంతిని బాలకృష్ణ పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? అసలు నిజం ఇదే.. వీరి మధ్య గ్యాప్‌కి కారణం ఏంటంటే?

Published : Jun 17, 2026, 04:02 PM IST

Fact: నందమూరి బాలకృష్ణ.. లేడీ అమితాబ్‌ విజయశాంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అసలు ఆ టైమ్‌లో ఏం జరిగిందనేది చూస్తే షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. వీరి మధ్య గ్యాప్‌కి కారణం ఏంటో తెలిసింది.  

PREV
14
విజయశాంతి, బాలయ్య పెళ్లి చేసుకోవాలనుకున్నారా?

బాలకృష్ణ, విజయశాంతి ఒకప్పుడు టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అది హిట్‌ అనేలా పరిస్థితి ఉండేది. సినిమాలు కూడా అదే స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో వీరికి మంచి క్రేజ్‌ ఉండేది. కానీ ఒక దశ తర్వాత ఈ ఇద్దరు సినిమాలు చేయడం మానేశారు. దానికి కారణం `పెళ్లి` అనే టాక్‌ వినిపించింది. విజయశాంతి పెళ్లి చేసుకున్న తర్వాత బాలయ్యతో సినిమాలు చేయలేదని అంటుంటారు. అదే సమయంలో బాలయ్య, విజయశాంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారనే ఇంట్రెస్టింగ్‌ వార్త చక్కర్లు కొట్టింది.

24
బాలయ్యతో విజయశాంతి పెళ్లి.. నిజం ఏంటంటే?

మరి నిజంగానే.. బాలయ్య, విజయశాంతి మ్యారేజ్‌కి రెడీ అయ్యారా? అసలు అప్పుడు ఏం జరిగిందనేది ఆరా తీస్తే, అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఆ టైమ్‌లో అసలు జరిగింది ఏంటో ప్రముఖ సినీ విశ్లేషణకులు చిల్లగట్టు శ్రీకాంత్‌ వెల్లడించారు. బాలయ్య, విజయశాంతి మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారనే దాంట్లో నిజం లేదని తెలిపారు. అందుకు లాజిక్‌ కూడా వెల్లడించారు. బాలయ్య పెళ్లి 1982లో వసుంధర దేవితో జరిగింది. కానీ బాలయ్య.. విజయశాంతితో ఆ తర్వాతే కలిసి సినిమాలు చేశారు. అంటే విజయశాంతితో కలిసి నటించే నాటికి బాలయ్యకి పెళ్లి అయిపోయింది. కావున ఈ వార్తలో నిజం లేదని తెలిపారు విశ్లేషణకులు.

34
బాలయ్యతో గ్యాప్‌కి కారణం చెప్పిన విజయశాంతి

విజయశాంతి మ్యారేజ్‌ చేసుకున్న శ్రీనివాస ప్రసాద్‌.. బాలయ్య బంధువు అని, వారి మ్యారేజ్‌ సెట్‌ కావడానికి ఓ కారణం బాలయ్యనే అని అంటుంటారు. మరి బాలయ్య, విజయశాంతి పెళ్లి తర్వాత ఎందుకు కలిసి నటించలేదనే దానికి అసలు కారణంగా విజయశాంతి తెలిపింది. తాను ఆ సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసిందట. అవి పెద్ద హిట్‌ అయ్యాయి. హీరోలకు సమానంగా తన సినిమాలు ఆడుతున్నాయి. కలెక్షన్లని భారీగానే వసూలు చేస్తున్నాయి. దీంతో పారితోషికం కూడా హీరోలకు సమానంగా డిమాండ్‌ చేసిందట. నిర్మాతలు కూడా అంత ఇచ్చేందుకు ఓకే చెప్పారు.

44
హీరోలకు సమానంగా విజయశాంతి సినిమాలు

అయితే పాత్ర పరంగా ప్రయారిటీ విషయంలో తేడాలు వచ్చేవని, హీరోలకు ఎక్కువగా, తన పాత్రకి తక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో, దాన్ని విజయశాంతి ప్రశ్నించిందని, అలా ఉన్న సినిమాలు రిజెక్ట్ చేసిందని, ఇలా బాలయ్యతో సినిమాలు చేయలేకపోయినట్టు తెలిపింది. చిరంజీవితోనూ ఈ కారణంగానే ఆ తర్వాత కలిసి నటించలేకపోయినట్టు తెలిపింది. అదే గానీ మరో కారణం కాదని ఆమె ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇదిలా ఉంటే బాలయ్యకి 1982లో పెళ్లి అయితే, విజయశాంతి 1988లో శ్రీనివాస ప్రసాద్‌ని వివాహం చేసుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories