అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 షూటింగ్ ఆగిపోయిందని టాలీవుడ్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో నిజం ఎంత? బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? బాలయ్య అలిగారంటూ వస్తున్న వార్తలు నిజమేనా? అసలేం జరుగుతుంది? 

Balakrishna Akhanda 2 Halted? Rumors on Balayya-Boyapati Clash in telugu jms

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ  బడ్జెట్ మూవీ  అఖండ 2. బాలయ్యకు సాలిడ్ సక్సెస్ అందించిన అఖండ మూవీకి రీమేక్ గా ఈసినిమా రూపొందుతోంది. బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది. వీరిద్దరి కాంబోకు మంచి డిమాండ్ ఉంది. వీరు కలిసి చేసిన  సినిమాలన్నీ దాదాపుగా సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అలా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అఖండ. అంతకు మందు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడిన బాలయ్యకు అఖండ సినిమాతో భారీ సక్సెస్ వరించింది.

Also Read: 1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

AKHANDA 2

 ఈసినిమా తరువాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా హిట్ అయ్యాయి. దాంతో మరోసారి అఖండ సీక్వెల్ తో అదరగోట్టాలని ప్లాన్ చేశారు బాలయ్య , బోయపాటి. అఖండ సెట్ చేసిన  రికార్డులను మించి  సెట్ చేయాలని అనుకుంటున్నారట టీమ్.  ఇక ఇపుడు పార్ట్ 2 షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


Boyapati Srinu

అఖండ2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని, బాలయ్య అలిగి షూటింగ్ నుంచి వెళ్ళిపోయారని, బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు అని షూటింగ్ అంత మంచిగ జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ మొదలయ్యింది.
 

 అసలు ఏం జరుగుతుంది అని వాకబు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మూవీ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం షూటింగ్  అనుకున్నట్టే  సజావుగా జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు  థమన్ అదిరిపోయే ట్యూన్ లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడు. అఖండ సినిమాకు థమన్ వాయింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అఖండ2కు అంతకు మించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఇక  ఈసినిమాను  14 రీల్స్ బ్యానర్ పై  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!