బిగ్ ట్విస్ట్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బాలాదిత్య అవుట్.. మరో కంటెస్టెంట్ కూడా ?

Published : Nov 12, 2022, 04:13 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 కీలక దశకు చేరుకుంది.

PREV
16
బిగ్ ట్విస్ట్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బాలాదిత్య అవుట్.. మరో కంటెస్టెంట్ కూడా ?

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారంతా బలమైన సభ్యులే. 

26

ఆదివారం రోజు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని షాకింగ్ లీకులు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని ఆ ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ పార్ట్ షూట్ పూర్తయినట్లు చెబుతున్నారు. 

36

ఎలిమినేట్ అయిన ఆ ఇద్దరిలో మొదటి కంటెస్టెంట్ బాలాదిత్య అని అంటున్నారు. మరో కంటెస్టెంట్ మెరీనా అని తెలుస్తోంది. ఈ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. బాలాదిత్య అయితే హౌస్ లో అందరికి ప్రవచనాలు చెబుతున్నట్లుగా నీతి సూక్తులు చెబుతాడనే ప్రచారం ఉంది. అయితే ఎలాంటి నెగిటివిటి లేని బాలాదిత్యకి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. 

46

బాలాదిత్య ఎలిమినేషన్ న్యూస్ బయటకి రాగానే ఆయన సపోర్టర్స్ అంతా బిగ్ బాస్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు. బాలాదిత్య లాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే హౌస్ లో ఉన్న పాజిటివిటీని ఎలిమినేట్ చేసినట్లే అని చెబుతున్నారు. అసలు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఊహించలేదు. కావాలనే పెట్టినట్లు ఉన్నారు. బాలాదిత్య పాజిటివిటి, మెచ్యూరిటీ ఉన్న కంటెస్టెంట్ అని ప్రశంసిస్తున్నారు . 

56
Bigg Boss Telugu 6

మరో వైపు గీతూ అభిమానులు బాలాదిత్య ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. గీతూ ఎలిమినేట్ అయినప్పుడు బాలాదిత్య ఫ్యాన్స్ ఎగిరెగిరి పడ్డారు. కర్మ అనేది బూమరాంగ్.. తిరిగి మనకే తగులుతుంది. ఇప్పుడు అర్థం అయిందిగా అంటూ బాలాదిత్య ఫ్యాన్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. 

66

మరోవైపు మెరీనా కూడా ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. రోహిత్ మెరీనా జంటగా హౌస్ లోకి అడుగు పెట్టారు. కానీ భర్త కంటే ముందుగానే ఆమె ఎలిమినేట్ అవుతోంది. మరికొందరు బాలాదిత్య అభిమానులు అయితే.. బిగ్ బాస్ చూడడం ఆపేస్తాం. బాలాదిత్య లాంటి నిజాయతీ పరులకు ఇది స్థానం కాదు అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. 

click me!

Recommended Stories