2015లో టెంపర్ విడుదలయింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్, దేవర 1 ఇలా వరుస హిట్ చిత్రాలతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ కెరీర్ ఇలా లేదు. ఒక దశలో తారక్ దారుణమైన ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఎలాంటి చిత్రాలు చేసినా కొన్నేళ్లు వర్కౌట్ కాలేదు.