టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో యువతను తెగ ఆకట్టుకున్న అషురెడ్డి.. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ హౌజ్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ పాపులారిటీ మరింతగా పెరిగింది.