అనుష్కకి నేనే బెస్ట్ కోస్టార్ అని ఆమె చెప్పినట్లు నవీన్ సరదాగా కామెంట్స్ చేశాడు. దీనితో నెటిజన్లు కూడా ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. అనుష్కకి నువ్వు బెస్ట్ కోస్టార్ అయితే మరి ప్రభాస్ ఏంటి ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. తన బెస్ట్ కోస్టార్ ప్రభాస్ అంటూ అనుష్క పలు సందర్భాల్లో తెలిపింది. అనుష్క ప్రభాస్ కలసి బిల్లా, మిచ్చి, బాహుబలి రెండు భాగాల్లో నటించారు. అనుష్క, ప్రభాస్ లది వెండితెరపై సూపర్ హిట్ కాంబినేషన్.