‘కార్తీకేయ 2’తో మంచి సక్సెస్ అందుకున్న అనుపమా.. ప్రస్తుతం ‘డీజే టిల్లు 2’ (DJ Tillu 2) లో నటిస్తోంది. బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తుంది. ఇందులో అనుపమా ఎలా అలరించబోతుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక అనుపమా నటించిన ‘18 పేజెస్’,‘బటర్ ఫ్లై’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.