మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.