ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనుపమా టాలీవుడ్ హీరోయిన్ గా వరుస ఆఫర్లు అందుకుంటోంది. చివరిగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ‘18 పేజెస్, కార్తీకేయ 2, బట్టర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది. 18పేజెస్ మూవీ జూన్ 1కు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేకర్స్ వాయిదా వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన చిత్రాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.