గోల్కొండా హైస్కూల్ లాంటి సినిమాలతో బాలనటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు సంతోష్ శోభన్. వర్షం సినిమాలాంటి హిట్స్ ఇచ్చిన తన తండ్రి అకాల మరణంతో.. ఇండస్ట్రీలో తాను నిలబడాలన్న తపనతో ప్రయత్నిస్తున్నాడు. తండ్రి ఇమేజ్ ను ఎక్కడా ఉపయోగించకుండా.. తన సొంత కాళ్ల మీద నిలబడాలన్న తాపత్రేయంతో పనిచేస్తున్నాడు సంతోష్.
అలా మొదలైంది, ఓ బేబీలాంటి ఆర్ట్ మూవీస్ తో.. సూపర్ సక్సెస్ లు అందుకున్న నందినీ రెడ్డి.. ఈసారి సంతోష్ శోభన్ తో.. పక్కా ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించారు. ఒక పాయింట్ ను పట్టుకుని సినిమా చేయడంతో.. ఆమె తరువాతే ఎవరైనా. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుంది నందినీ రెడ్డి. మరి ఈసారి ఈసినిమాను ఎలా రూపొందించిందో చూడాలి.
ట్విట్టర్ రివ్యూస్ మాత్రం ఈసినిమాపై పాజిటీవ్ గానే వస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులు పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. సినిమా బాగుందని మంచి ప్యామిలీ స్టోరీ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. నందినీ రెడ్డి టేకింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు చాలా హాయిగా.. రిలాక్స్ గా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మంచి ఫ్యామిలీ డ్రామను అంద్భుతంగా చేశారంటున్నారు ఆడియన్స్.. ఈసినిమా ఫస్ట్ హాఫ్ బోరు కొట్టించలేదు. చాలా ప్లసెంట్ గా అనిపించింది అన్నారు ట్విట్టర్ ఆడియన్స్. సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరిగేలా ఫస్ట్ హాఫ్ ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక కొన్ని చోట్ల అన్ని మంచిశకునములే సినిమా ఫస్ట్ హాఫ్ పడగానే సెకండ్ హాఫ్ షో ఆగిపోయినట్టు.. ట్వీట్లు కనిపించాయి. ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సెకండ్ హాఫ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. పస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్..సెకండ్ హాఫ్ పై చాలా ఇంట్రెస్ట్ తో ఎదురు చేస్తుున్నారు.
ఇక ఈసినిమాసెకండ్ హాఫ్ చూసిన ప్రేక్షకులు మిక్స్ టాక్ ను వినిపిస్తున్నారు. కామెడీ వర్కౌట్ అవ్వగా.. కొన్ని బోరింగ్ సీన్స్ ఇబ్బంది పెట్టాయని అంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్. సినిమా బాగుంది.. కాకపోతే కొన్ని విసిగించే సన్నివేశాలు ఉన్నట్టు ట్వీట్ చేస్తున్నారు.
మరికొంత మంది మాత్రం సినిమా స్క్రీన్ ప్లూ చాలా స్లోగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ , కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.. కాని స్క్రీన్ ప్లే.. స్లో నేరేషన్ తో పాటు.. సీనియర్ డైరెక్టర్ అయిన నందినీ రెడ్డి... టేకింగ్ విషయంలో కాస్త తడబడ్డట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి సంతోష్ శోభన్ కెరీర్ కుమాత్రం ఈసినిమా మంచి బుస్టప్ ఇస్తుంది అనడంలో ఏమత్రం సందేహం లేదు.