'అనితా ఓ అనితా' సింగర్ దీనస్థితి.. పిల్లలిద్దరికీ అదే పరిస్థితి, ఆర్థిక సమస్యలతో నాగరాజు పోరాటం

Published : Apr 10, 2023, 01:55 PM IST

'నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగనీకుమా.. అనితా ఓ అనితా' అంటూ యువత హృదయాల్ని ద్రవింపజేసిన సాంగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 15 ఏళ్ల క్రితం ఈ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయింది.

PREV
16
'అనితా ఓ అనితా' సింగర్ దీనస్థితి.. పిల్లలిద్దరికీ అదే పరిస్థితి, ఆర్థిక సమస్యలతో నాగరాజు పోరాటం

'నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగనీకుమా.. అనితా ఓ అనితా' అంటూ యువత హృదయాల్ని ద్రవింపజేసిన సాంగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 15 ఏళ్ల క్రితం ఈ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. తన రియల్ లైఫ్ ప్రేమ ఫలించకపోవడంతో తన ప్రేయసిని తలకుంటూ సింగర్ నాగరాజు పడిన పాట అది. 

26

ఆ తర్వాత ఇన్నేళ్ళలో నాగరాజు పేరు ఎక్కడా అంతగా వినిపించలేదు. నాగరాజు కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడా సందడి చేయలేదు. కానీ ఊహించని విధంగా నాగరాజు వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం నాగరాజుకి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో తన జీవిత కష్టాల నాగరాజు వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. 

36

నాగరాజు ఆర్థిక సమస్యలు, పిల్లల పరిస్థితి గురించి తెలిస్తే ఎంతటివారికైనా హృదయం బరువెక్కాలసిందే. నాగరాజు ఈ ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. అనితతో బ్రేకప్ అయ్యాక ఆ సాంగ్ తన హృదయం నుంచి వచ్చింది అని నాగరాజు తెలిపారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం.. వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం వల్లే విడిపోవాల్సి వచ్చింది. అనితకి కూడా పెళ్లయింది. నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

46

కానీ నా పిల్లల గురించి తలుచుకుంటేనే భాద వేస్తుంది. పెద్దబ్బాయికి చెవుడు మూగ.. చిన్నబ్బాయికి కూడా అలాగే ఉంది. ఆసుపత్రిలో చూపిస్తున్నాము. కానీ ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి నా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. అప్పుడప్పుడూ స్టేజి షోలు చేస్తూ.. పాన్ షాప్ నడుపుతూ ఫ్యామిలీని నెట్టుకొస్తున్నా అని నాగరాజు తన దీన స్థితిని వివరించారు. 

56

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ట్రై చేద్దాం అని ప్రొడ్యూసర్స్ ని కలిసేందుకు వచ్చా అని నాగరాజు తెలిపారు. లవ్ బ్రేకప్ అయినప్పటికీ నన్ను అర్థం చేసుకునే భార్య నా జీవితంలోకి వచ్చింది. నా భార్య పేరు దేవిక. ఇప్పుడు అనితా ఓ అనితా సాంగ్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నా. 

66

నేను కళామతల్లినే నమ్ముకున్నా. యూట్యూబ్ ఛానల్స్ కి పాటలు రాస్తున్నా. ఇండస్ట్రీలో అవకాశం వస్తే చాలా బావుంటుంది అని నాగరాజు తెలిపారు. అలాగే తన పిల్లల పరిస్థితి, తన ఆర్థిక సమస్యలు అర్థం చేసుకుని ఎవరైనా సాయం చేయాలని కూడా కోరారు. 

click me!

Recommended Stories