వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Feb 26, 2026, 08:41 PM ISTUpdated : Feb 26, 2026, 08:54 PM IST

మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమా విషయంలో సస్పెన్స్ కి తెరపడింది. అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్

హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అనిల్ రావిపూడి జైత్ర యాత్ర కొనసాగుతోంది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించే మూవీ ఏంటి అని అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి.

25
సస్పెన్స్ కి తెర

సస్పెన్స్ కి తెరదించుతూ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా తన చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ అనిల్ రావిపూడి తీయబోయే సినిమా ఎవరితోనో తెలుసా ? అనిల్ రావిపూడి సినిమాలో ఈసారి ఒక్క హీరో కాదు.. ఇద్దరు హీరోలు. అనిల్ రావిపూడి క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రకటించారు.

35
అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ప్రకటన

దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లతో ఈ మల్టీస్టారర్ చిత్రం ఉండబోతోంది. అనిల్ రావిపూడి పోస్ట్ చేస్తూ.. మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. వెంకటేష్ గారితో, "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం అని ప్రకటించారు.

45
వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు

వెంకటేష్ గతంలో మహేష్ బాబు, రామ్ పోతినేని, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో చేయబోతున్నారు. అది కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కావడంతో ఆసక్తి నెలకొంది.

55
కళ్యాణ్ రామ్ తో రెండోసారి

గతంలో అనిల్, వెంకీ కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాలు వచ్చాయి. కాగా అనిల్ రావిపూడి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చింది కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంతోనే. సో వీరిద్దరి కాంబోలో ఇది రెండవ చిత్రం.

Read more Photos on
click me!

Recommended Stories