ఎపిసోడ్ ప్రారంభంలో మీ పెళ్ళెప్పుడు అని ఎందుకు మెసేజ్ పెట్టారు, అంటే నేను వేరే పెళ్లి చేసుకుంటానని మీ ఉద్దేశమా.. నేను మనసులో ఒకరిని పెట్టుకొని నా పక్కన ఇంకొకరిని పెట్టుకోలేను అంటాడు రిషి. మీ మనసులో ఉన్న ఆ ఒక్కరు ఎవరు సార్ అని అడుగుతుంది వసుధార. ఎవరో నీకు తెలియదా అంటూ ఆమెకు దగ్గరగా వెళ్లి నువ్వే వసుధార..మన ఇద్దరిదీ రిషిదారల బంధం అనటంతో రిషి ని హగ్ చేసుకుంటుంది వసుధార.