యాంకర్ విష్ణుప్రియ భీమినేని, పొడుగు ముక్కుతో ఎనర్జిటిక్ గా కనబడుతూ, ఈటీవీలో ప్రసారమయ్యే పోవే పోరా షోతో బాగా పాపులర్ అయ్యింది. ఆకట్టుకునే అందం, గలగలా మాట్లాడే మాటలు, అన్ని వెరసి కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది ఈ హాట్ బ్యూటీ. అంతే కాకుండా ఈ మధ్య ఫోటో షూట్లతో కాక రేపుతోంది కూడా..!
తనకు ఎప్పటినుండో హీరో అఖిల్ అంటే పిచ్చి అని చెప్పుకొచ్చే ఈ హాట్ యాంకర్ తాజాగా మరొక హీరో అంటే తనకు ప్రేమని బహిరంగంగానే చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఈ మధ్య సన్నిహతంగా ఉన్నట్టుగా మరో యాంకర్ శ్రీముఖి కూడా కంఫర్మ్ చేయడం ఇక్కడ మరో ఎత్తు.
ఇంతకు ఎవరా హీరో అనుకుంటున్నారా...? అతనే హీరో నవదీప్. ఈ మధ్య కాలంలో హీరో క్యారెక్టర్లను వదిలి వేరే పాత్రలను పోషిస్తున్న నవదీప్.... జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షోలో జడ్జి గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఐ లవ్ నవదీప్ అని ఓపెన్ గా చెప్పింది విష్ణు ప్రియా.
వివరాల్లోకి వెళితే ఈటీవీలో వచ్చే కాష్ షో శనివారం ప్రసారమైంది. ఈ షో కి శ్రీముఖి, డాన్సర్ పండు, గెటప్ శ్రీను, విష్ణు ప్రియా వచ్చారు. ఈ షో లో యాంకర్ సుమ రాణా, నవదీప్ లలో ఎవరితో యాంకరింగ్ చేయడానికి ఇష్టపడతావు అని అడగగా.... నవదీప్ తో అని గుక్కతిప్పుకోకుండా చెప్పడమే కాకుండా, నవదీప్ ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరిచింది.
వెంటనే అక్కడే ఉన్న శ్రీముఖి రీసెంట్ గా నవదీప్ తో విష్ణు ప్రియా బాగా దగ్గరవడం జరిగిందని, నవదీప్ వాళ్ళింటికెళ్లి డిన్నర్లు అలాగే.... అని శ్రీముఖి అంటుండగా విష్ణుప్రియ కల్పించుకొని ఎరా అందరికి చెబుతున్నావని కూడా అనింది. (Pic Credit: ETVTeluguIndia)
సుమ ఈ సంభాషణను ముందుకు తీసుకెళ్తు అక్కడేమేమి ఉన్నాయని కూడా అడిగింది. దానికి శ్రీముఖి మాట్లాడుతూ... అక్కడ దోసల దగ్గరి నుండి వీగన్ వరకు అన్ని ఒక బుఫే స్ప్రెడ్ లాగ ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ విషయం స్వయంగా విష్ణు ప్రియా ద్వారానే తెలుసుకున్నానని, తాను మా ఇంటికి వస్తుండడం వల్ల ఈ విషయాలు తెలిశాయని అసలు విషయాన్నిబయటపెట్టింది శ్రీముఖి.
గతంలో నవదీప్ హోస్ట్ చేసేటాలీవుడ్ స్క్వేర్స్ అనే ఒక ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చిన విష్ణుప్రియ అప్పుడు కూడా టాలీవుడ్ లో వన్ అఫ్ ది హ్యాండ్సమ్ హీరో నవదీప్ అని చెప్పడమే కాకుండా.... ఎప్పటినుండో కూడా తనకు నవదీప్ లాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది. (Pic Credit: Viu India)
ఈ అన్ని పరిస్థితులను గమనిస్తున్ననెటిజన్లు ఏమిటి సంగతి అని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు సంధిస్తున్నారు. విష్ణుప్రియ రెగ్యులర్ గా నవదీప్ తో టచ్ లో ఉండడమే కాకుండా ఇంటికి వెళ్ళడాలు, బహిరంగంగానే ఇలా అనౌన్స్ చేయడాలు ఏమిటి మ్యాటర్ అని అంటున్నారు..?