ట్రెండీ వేర్ లో విష్ణు ప్రియా స్టన్నింగ్ లుక్.. యంగ్ యాంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

First Published | Aug 8, 2023, 1:24 PM IST

యంగ్ యాంకర్ విష్ణు ప్రియా ప్రస్తుతంనటిగా కెరీర్ లో ముందుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తనవంతు కృషి చేస్తోంది. రీసెంట్ గా ‘దయా’ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

యంగ్ బ్యూటీ, యాంకర్ విష్ణు ప్రియా (Vishnu Priya) టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ‘పోవే పోరా’ గేమ్ షోతో పాటు ఆయా టీవీ షోల్లో మెరిసి ఆకట్టుకుంది. యాంకర్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం నటిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. 
 

ఇప్పటికే విష్ణు ప్రియా ‘చెక్ మేట్’ సినిమాతో నటిగా అలరించింది. అంతకంటే ముందు మలయాళంలో  ‘మయూకమ్’, తమిళంలో ‘శివప్పతిగరమ్’ చిత్రాలు కూడా చేసింది. తెలుగులో ‘యమదొంగ’లో సపోర్టింగ్ రోల్ చేసింది. అలాగే కన్నడలోనూ ‘గూలీ’ అనే చిత్రంతో అలరిచింది. 
 


యాంకర్ గా కొద్దికాలం బుల్లితెరపై సందడి చేసిన విష్ణు ప్రియా ప్రస్తుతం నటిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఆ మధ్యలో ‘జరీజరీ పంచెకట్టు’ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 
 

రీసెంట్ గా ‘దయా’ వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియా ప్రధాన పాత్ర పోషించింది. జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత తెలుగులో చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ సిరీస్‌లో విష్ణు ప్రియాతో పాటు ఈషా రెబ్బా కూడా ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 
 

ఈ సినిమాలతో తనకు మంచి క్యారెక్టర్ ను అందించిన యూనిట్ కు విష్ణు ప్రియా థ్యాంక్స్ చెబుతూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. తనకు షబానా  రోల్ లో నటించడం బాగనిపించిందని చెప్పుకొచ్చింది. తనను నమ్మినందుకు దర్శకుడు సదినేని పవన్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇక తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా థ్యాంక్స్ చెప్పింది. 
 

ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. డెనీమ్ జీన్స్, టాప్, స్లీవ్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. గతంలో అందాల వరద ప్రవహించేలా చేసిన విష్ణు ప్రియా లేటెస్ట్ లుక్ లో తన పాత్రను సూచించేలా మెరిసింది. ఆమె ఫొటోలను అభిమానులు లైక్స్ చేస్తున్నారు. పొగుడుతూ కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!