తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుమ. బుల్లి తెరరారాణిగా 30 సంవత్సరాలుగా ప్రేక్షకులనుఅలరిస్తున్న సుమ ను వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్ద వారి వరకు సుమక్క అని సంబోధించడం మనం చూస్తుంటాము. ఆ పిలుపు ఎంత పాపులర్ అయ్యిందంటే.... ఆమె స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కి కూడా అదే పేరును పెట్టేంత.
ఇక తాజాగా సుమ కనకాల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ పై తీవ్రంగా ఫైర్ అయింది. నీ ముక్కు తగలెయ్య అంటూ అవినాష్ పై విరుచుకుపడింది. అక్కడితో ఆగకుండా ముక్కు పెద్దగా ఉందని సెటైర్లు వేస్తూ ఎలాంటి మాస్కు పెట్టుకుంటున్నాడో అని కూడా కామెంట్ చేసింది.
ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా...? శ్రీముఖి ప్రారంభించిన ఓ ఉమనియా షో లో. ఓ ఉమనియా తొలి ఎపిసోడ్ నేడు యూట్యూబ్ లో విడుదలయింది. శ్రీముఖి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈ షో ని అప్లోడ్ చేస్తుంది. ఇక ఈ తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన సుమ జబర్దస్త్ ముక్కు అవినాష్ పై ఫైర్ అయింది.
సుమ తో శ్రీముఖి విస్పర్ఛాలెంజ్ ఆడించింది. ఇందులో సుమకు ఏమి వినిపించకుండా హెడ్ ఫోన్స్ పెట్టి శ్రీముఖి ఒక పాటను పాడుతుంది. దాన్ని లిప్ మూమెంట్ ద్వారా సుమ గెస్ చేయాల్సి ఉంటుంది. అన్ని పాటలను గెస్ చేసిన సుమ చివరి పాటకు ముందు పాటనుగెస్ చేయలేకపోయింది.
యువసేన చిత్రం నుండి "మల్లీశ్వరివే.... "పాటకు ముందు వచ్చే రాప్ ను శ్రీ ముఖి వినిపించింది. ఆ పాత ఇంతకీ సుమకు అర్థం అవలేదు. అప్పుడు శ్రీముఖి.... ఈ పాటను సజెస్ట్ చేసింది ముక్కు అవినాష్ అన్న విషయాన్ని వెల్లడించింది.
శ్రీముఖి ఎప్పుడైతే ముక్కు అవినాష్ ఈ సలహా ఇచ్చాడు అని చెప్పిందో సుమ.... "ఒరేయ్ ముక్కు అవినాష్! నీ ముక్కు తగలెయ్య"అని ఫైర్ అయింది. అక్కడితో ఆగకుండా.... ఏం మాస్కు పెట్టుకుంటున్నాడో ఏమో అంటూ సెటైర్లు కూడా వేసింది.
ఇలా ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు సుమ ముక్కు అవినాష్ ని నీ ముక్కు తగలెయ్య అంటూ తిట్టింది. ఇంకా వేరే పాటదొరకలేదారా నీకు అంటూ ఫైర్ అయింది సుమ. అవినాష్ సజెస్ట్పాటను సుమ గెస్ చేయలేకపోయింది.
మనం సక్సెస్ రా అవినాష్ అంటూ శ్రీముఖి గట్టిగా అరిచింది. దీనితో... "తరువాత కనిపించరా అవినాష్ తుమ్ము వచ్చిన వాళ్లతో నీ ముందు తుమ్మిస్తాను" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది సుమ. శ్రీముఖి తన సొంతగా చేస్తున్న ఈ షో బాగానే సక్సెస్ అయ్యేలా కనబడుతుంది.