వామ్మో శ్రీముఖి మాములు ముదురు కాదు... కొత్త వ్యాపారం మొదలెట్టిందిగా!

First Published Feb 15, 2021, 1:00 PM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి జోరు మాములుగా లేదు. నటిగా, యాంకర్ గా రాణిస్తూనే వ్యాపారం వైపు కూడా అడుగులు వేశారు ఆమె. శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా తన వ్యాపారం గురించి ఫ్యాన్స్ కి తెలియజేశారు. 

లూవీ అనే పేరుతో ఓ బ్రాండ్ ఏర్పాటు చేసిన శ్రీముఖి స్టోర్స్ లాంఛ్ చేశారు. బ్రాండెడ్ అప్పీరెల్స్, కాస్మొటిక్స్, యాక్సెసరీస్ ఈ స్టోర్స్ నందు లభించే ఉత్పత్తులుగా తెలుస్తున్నాయి.
undefined
నటిగా, యాంకర్ గా తనను ఆదరించారని, బిజినెస్ వుమెన్ గా కూడా సక్సెస్ చేయాలని ఆమె అభిమానులకు కోరడం జరిగింది. ఓ స్టైలిష్ ఫోటో షూట్ చేసిన శ్రీముఖి సుదీర్ఘ సందేశం పంచుకున్నారు.
undefined
సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తూనే వ్యాపారం వైపు శ్రీముఖి అడుగులు వేయడం, మెచ్చుకోదగ్గ విషయమే అని చెప్పాలి. ఇప్పటికే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఊకో కాకా పేరుతో ఓ గార్మెంట్స్ స్టోర్స్ చైన్ ప్రారంభించాడు .
undefined
రాహుల్ ని చూసి స్ఫూర్తి పొందిన శ్రీముఖి, తాను కూడా లూవి బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. మరి శ్రీముఖి కొత్త వ్యాపారం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
undefined
ఇక నటిగా కూడా శ్రీముఖి బిజీ అవుతున్నట్లు సమాచారం. శ్రీముఖి హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూనే విరామం దొరికినప్పుడల్లా విహారాలకు చెక్కేస్తోంది శ్రీముఖి. ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళింది ఆమె.
undefined
గోవా బీచ్ లో జలకాలాడుతూ హాట్ హాట్ ఫోటోలు పంచుకోగా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి.
undefined
ఏదిఏమైనా రెండు చేతులా సంపాదిస్తూ శ్రీముఖి చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
undefined
click me!