మనుషుల మధ్య కూడా పెట్టోచ్చుకదా..? నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మి

Published : Jan 17, 2023, 09:12 PM IST

సోషల్ మీడియాలో ఓ నెటిజన్లకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది యాంకర్ రష్మి గౌతమ్. మూగజీవాలపై పిచ్చిపిచ్చి పోస్ట్ లు పెట్టినందుకు గట్టిగా ఇచ్చేసింది.   

PREV
18
మనుషుల మధ్య కూడా పెట్టోచ్చుకదా..? నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మి

బుల్లితెరపై స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది యాంకర్ రష్మి. జబర్థస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ తో రష్మీ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  మరో వైపు శ్రీదేవి డ్రామా కంపెనీతో ఇంకా ఎక్కువగా ఆడియన్స్ లో కి దూసుకుపోయింది బ్యూటీ. అటు టెలివిజన్.. ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలన్స్ చేస్తుంటుంది రష్మి. 

28

మరో వైపు అప్పుడప్పుడు  సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రష్మి గౌతమ్. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడంతో పాటు.. సోషల్ వర్క్ కూడా చేస్తుంటుంది. ముఖ్యంగా మూగజీవాలకు ఏమైనా జరిగిందంటే ఏమాత్రం సహాంచదు రష్మి వెంటనే స్పందిస్తుంది. 

38

మూగజీవాలంటే రష్మిక ప్రాణం.  ఎవరైనా వాటిని ఏమైనా అంటే.. జీవాలపై దాడులు చేస్తే.. నెట్టింట్లో రచ్చ చేస్తుంది బ్యూటీ. వారి దిమ్మ తిరిగేలా పోస్ట్ లు పెడుతుంది. ఎవరైనా మూగజీవాలకు హానీ చేస్తే వారికి శిక్ష పడే వరకు ఈమె పోరాటం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే జీవాలపట్ల క్రూరత్వం చూపించి రష్మి చేతిలో బలైనవారు చాలా మంది ఉన్నారు. 

48
Rashmi Gautam

ఈక్రమంలో తాజాగా రష్మి  మరోసారి ఇటువంటి విషయంలోనే  మండిపడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాలలో కోడిపందేలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోడిపందాలపై ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక డాక్టర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండుసార్లు కోడిపందంలో గెలిచానని పోస్ట్ పెట్టాడు.  ఈ పండుగను బాగా ఎంజాయ్ చేస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
 

58

అయితే ఈ పోస్ట్ ను చూసిన రష్మికి చిర్రెత్తుకొచ్చింది. ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇలా చేస్తాడా అంటూ మండి పడింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చింది.. నీ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకెళ్లి మురికి కాలువలో పడెయ్ ఇలా హింసను ప్రోత్సహిస్తున్నారా అంటూ ట్వీట్ చేశారు. 

68

ఈ పోస్ట్ పై  ట్విట్టర్ పెద్ద వార్ జరిగింది. ఇందులో కొంత మంది రష్మికి సపోర్ట్ పలికితే.. మరికొంత మంది మాత్రం ఆమెను విమర్షించారు. ఈక్రమంలో  ఒక నెటిజన్ ఈ విషయం పై స్పందిస్తూ…కోడికి లేని బాధ మీకే ఎందుకు మేడం..ఇది గర్వం కాదు..మా సాంప్రదాయం అంటూ ట్వీట్ చేశారు.

78

ఇక ఆనెటిజన్ కు బుర్రతిరిగే సమాధానం ఇచ్చిందిరష్మీ.   రష్మీ స్పందిస్తూ కోడికి బాధ లేదని నీకు తెలుసా.. అయినా మీరు మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు..కోళ్ల బదులు మనుషులను పెట్టొచ్చుకదా..  గ్లాడియేటర్ పోరాటాలు సాంప్రదాయాలలో భాగమే. మరి వాటిని కూడా తీసుకుని సాంప్రదాయం పేరిట చనిపోయే వరకు మనుషులను పంపాలి అంటూ ట్వీట్ చేశారు. 

88

ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చాలా మంది రష్మిని ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. బాగా బుద్ది చెప్పావంటున్నారు. గతంలో కూడా చాలా విషయాల్లో ఇలానే స్పందించింది రష్మీ గౌతమ్. 

Read more Photos on
click me!

Recommended Stories