అనసూయ షాకిచ్చేలా నెక్ట్స్ సినిమాల లైనప్‌.. పవన్‌, బన్నీ, ఎన్టీఆర్‌లతో రచ్చ చేయబోతున్న హాట్‌ యాంకర్‌

Published : Dec 13, 2022, 06:30 PM IST

యాంకర్‌ అనసూయ యాంకరింగ్‌కి దూరమవుతుంది. ఆమె ఉన్న ఒక్క షో వదిలేసింది. సినిమాల్లో బిజీ అవుతుంది. తాజాగా ఆమె నెక్ట్స్ సినిమాల లైనప్‌ షాకిచ్చేలా ఉండటం విశేషం. 

PREV
17
అనసూయ షాకిచ్చేలా నెక్ట్స్ సినిమాల లైనప్‌.. పవన్‌, బన్నీ, ఎన్టీఆర్‌లతో రచ్చ చేయబోతున్న హాట్‌ యాంకర్‌

అనసూయ(Anasuya) అంటే `జబర్దస్త్`(Jabardasth) గుర్తొస్తుంది. ఆ కామెడీ షో ఆమెకి యాంకర్‌గా స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఆ షోతో హాట్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఊహించని విధంగా `జబర్దస్త్`ని వీడింది. అందులో తనపై వచ్చే కామెంట్లు, బాడీ షేమింగ్‌ పంచ్ లను తాను తట్టుకోలేక షోని వీడినట్టు చెప్పింది. ఇప్పుడు కొంత గ్యాప్‌ తీసుకున్నట్టు తెలిపింది. ఏదైనా ఎగ్జైటింగ్‌ షో వస్తే యాంకరింగ్‌ చేస్తానని తెలిపింది అనసూయ. 

27

ఈ నేపథ్యంలో ఇటీవల నెటిజన్లని ముచ్చటించింది అనసూయ. ఈ సందర్భంగా తన సినిమాల లిస్ట్(Anasuya Movies List) చెప్పింది. తన నెక్ట్స్ సినిమాల లైనప్‌ వెల్లడించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి తెలిపింది. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు, చేయబోతున్న సినిమాల గురించి వెల్లడించింది. ఆ లైనప్‌ చూస్తుంటే షాకిచ్చేలా ఉండటం విశేషం.

37

ఇందులో టాప్‌ స్టార్లు పవన్‌, తారక్‌, బన్నీ వంటి స్లార్లు ఉండటం విశేషం. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. కీలక పాత్రలో ఆమె కనిపించబోతుందట. గతంలో పవన్‌తో సినిమాకి సంబంధించి ఓ ఆఫర్‌ రాగా, జరిగిన వివాదాన్ని ఆ మధ్య వెల్లడించి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తుంది అనసూయ. 

47

మరోవైపు `పుష్ప2`లోనూ నటిస్తుంది. ఇప్పటికే `పుష్ప`లో నటించింది అనసూయ. రెండో పార్ట్ లోనూ సందడి చేయబోతుంది. త్వరలో ఈ చిత్ర షూటింగ్‌లో అనసూయ పాల్గొనే అవకాశం ఉందట. అలాగే ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు చేస్తావని ఓ అభిమాని ప్రశ్నించగా, త్వరలోనే ఆ కోరిక తీరబోతుందని వెల్లడించింది అనసూయ. మరి కొరటాల చిత్రంలో ఆమె నటించబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. 

57

వీటితోపాటు `రంగమార్తాండ`, `ఛేజ్‌`(తెలుగు, తమిళం), ఫ్లాష్‌ బ్యాక్‌(తెలుగు, తమిళం), తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని, డబ్బింగ్‌ చెప్పాల్సి ఉందట. అయితే ఇది విజయ్‌ సేతుపతి సినిమానా అని తెలుస్తుంది. అలాగే సందీప్‌ కిషన్‌తో `మైఖేల్‌`(పాన్‌ ఇండియా మూవీ), `సింబా`, `అరి`(తెలుగు, తమిళం)తోపాటు మరో తెలుగు సినిమా ఉందట. దాని గురించి ఇప్పుడే చెప్పలేనని పేర్కొంది. 
 

67

మరోవైపు రెండు కొత్త సినిమాలు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నాయి. మరోవైపు మలయాళంలో ఓ పెద్ద సినిమా చేయబోతున్నట్టు చెప్పింది. అది మమ్ముట్టి మూవీనా అని టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ప్రస్తుతం అనసూయ చేతిలో ఇప్పుడు 12 సినిమాలు ఉండగా, మరో రెండు టాక్స్ లో ఉందట. కీలక పాత్రలకు బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తున్న అనసూయ నటిగా జోరుమీదుందంని చెప్పొచ్చు. 
 

77

ఇదిలా ఉంటే చిన్న పాత్రల్లో నటించడంపై ఆమె స్పందిస్తూ, పాత్ర ప్రాధాన్యతకే ప్రయారిటీ ఇస్తానని, నిడివి ముఖ్యం కాదని చెప్పింది. కొన్ని సార్లు ఆబ్లిగేషన్‌తో చేయాల్సి వస్తుందని, స్టార్‌ హీరోని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుందని, కొన్ని సార్లు రాంగ్‌ జడ్జ్ మెంట్ తో చేస్తామని వెల్లడించింది. ఏదైనా ఆడియెన్స్ ని అలరించాలన్నదే లక్ష్యమని చెప్పింది అనసూయ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories