Anasuya: మళ్ళీ మెగా కాంపౌండ్ లో అనసూయ రచ్చ.. చిరంజీవికి మామూలు షాక్ కాదు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 14, 2022, 03:14 PM IST

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

PREV
17
Anasuya: మళ్ళీ మెగా కాంపౌండ్ లో అనసూయ రచ్చ.. చిరంజీవికి మామూలు షాక్ కాదు

యాంకర్ అనసూయ విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. యాంకర్ గా అనసూయ బుల్లితెరపై అందాలు ఒలికిస్తూనే వెండితెరపై తనలోని నటనని బయటకు తీస్తోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

27

పుష్ప పార్ట్ 2లో అనసూయ రోల్ మరింత క్రూయల్ గా ఉండబోతున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఇలా అనసూయ వెండితెరపై వైవిధ్యానికే ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది.

37

పుష్ప, రంగస్థలం చిత్రాల తర్వాత అనసూయ మరోసారి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ 'లూసిఫెర్' చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. రంగస్థలం, పుష్ప చిత్రాల్లో అనసూయ కథని మలుపు తిప్పే పాత్రల్లో నటించింది. 

 

 

47

గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా అనసూయ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న ముఖ్యమంత్రి పెద్ద కుమారుడే గాడ్ ఫాదర్. సేవ కార్యక్రమాలు చేస్తూ పేదవారికి అండగా ఉండే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. కీలక సమయంలో గాడ్ ఫాదర్ పరువు ప్రతిష్టలు మంటగలిపే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో అనసూయ కీలకంగా ఉంటుంది. 

 

57

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం వల్ల అనసూయ ఈ చిత్రంలో గర్భవతిగా మారుతుంది. కుట్రలో భాగంగా తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి 'గాడ్ ఫాదర్' అని చెబుతుంది. దీనితో చిరంజీవి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మొదట్లో అనసూయ పాత్రని ఎంతో జాలితో చూపిస్తారు. ఆ తర్వాత అనసూయ అసలు రంగు బయట పడుతుంది. అనసూయ కెరీర్ లోనే ఇది ఎంతో విభిన్నమైన పాత్ర అని అంటున్నారు. 

67

అనసూయ నెగిటివ్ రోల్స్ పండించడంలో అద్భుతంగా నటిస్తోంది. క్షణం చిత్రంలో అనసూయ నెగిటివ్ రోల్ చేసింది. రంగస్థలంలో అనసూయ పాజిటివ్ రోల్ ప్లే చేసింది. ఇక పుష్పలో కూడా ఆమెది నెగిటివ్ పాత్రే. దీనితో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. 

77
Anasuya Bharadwaj

ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనితో మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీ క్రేజీ చిత్రంగా మారిపోయింది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ఘనవిజయం అందుకుంది. మరి మెగాస్టార్ గాడ్ ఫాదర్ తెలుగులో ఆ మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి. 

click me!

Recommended Stories