వేశ్య పాత్రలో అనసూయ.. తనలోని మరో యాంగిల్‌ చూపిస్తానంటున్న హాట్‌ యాంకర్‌?

First Published | Feb 17, 2021, 9:40 AM IST

యాంకర్‌ అనసూయ ఇప్పటి వరకు `జబర్దస్త్` షోలో హాట్‌ హాట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. సినిమాల్లో ఐటెమ్‌ సాంగుల్లో అందాల విందు వడ్డించింది. ఇప్పుడు తనలోని పీక్‌ రొమాంటిక్‌ యాంగిల్‌ని చూపించబోతుంది. ఆమె వేశ్యగా మారబోతుంది. ఓ సినిమాలో వేశ్యగా కనిపించనుందనే వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

అనసూయ అంటే హాట్‌ అందాలకు కేరాఫ్‌.. ఆకట్టుకునే అభినయానికి ప్రతిబింబం. దానికి మరో యాంగిల్‌ని యాడ్‌ చేయబోతుందీ అందాల భామ.
ఇప్పుడు వేశ్యగా మారబోతుందట అనసూయ. ఓ సినిమా పడువు వృత్తిలో జీవించే అమ్మాయిగా కనిపించందట.

గోపీచంద్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్ని ఇటీవల ప్రకటించారు. `పక్కా కమర్షియల్‌` అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు. రాశీఖన్నా, ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది.
ఈ సినిమాలో వేశ్య పాత్రలో అనసూయ కనిపించనుందట. అంతేకాదు ఆ వృత్తిలో ఉండేవారి కష్టసుఖాలను, తెరవెనుక కథని తన పాత్ర ద్వారా ప్రతిబింబింప చేయబోతుందట.
తాను ఓ ఛాలెంజింగ్‌ గా తీసుకుని ఈ పాత్ర చేసేందుకు సిద్ధమవుతుందట అనసూయ. మరి ఇందులో నిజమెంతా అనేది చిత్ర బృందంగానీ, అనసూయగానీ అధికారికంగా ప్రకటిస్తూనే తెలుస్తుంది.
కానీ వేశ్యగా అనసూయ అనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కచ్చితంగా ఈ పాత్రలో అనసూయ రక్తికట్టిస్తారని ఆమె అభిమానులు చెబుతున్నారు.
నిజానికి వేశ్యగా నటించాలంటే చాలా గట్స్ కావాలి. ఆమె నటించేది నిజమే అయితే ఈ విషయంలో అనసూయని అభినందించాల్సిందే. నటిగా తనలోని మరో యాంగిల్‌ బయటకొస్తుందని చెప్పొచ్చు.
మరోవైపు అనసూయ ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో ఆమె ఆడిపాడింది. ఇప్పుడు కార్తికేయ హీరోగా రూపొందుతున్న `చావు కబురు చల్లగా`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోలను పంచుకుని `అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..అవసరం తీరాక ఆడుకుంటారు` అని చేసిన కామెంట్‌ ఇప్పుడు దుమారం రేపుతుంది. ఆమె ఈ ఐటెమ్‌ సాంగ్‌ లిరిక్‌ని ఉద్దేశించి పోస్ట్ చేసినా.. ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అవుతుంది.
దీంతోపాటు అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోతో బిజీగా ఉంది. అదే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే అవకాశం ఉందట. అలాగే `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`, `థ్యాంక్యూ బ్రదర్‌`తోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. రెండు చేతులా సంపాదిస్తుంది.

Latest Videos

click me!