కథానాయికల నాభిపై పూలు, పళ్ళు వేయడం రాఘవేంద్ర రావు స్టైల్. మహిళల్లో అందంగా కనిపించేది నడుమే.. అందుకే అలా చేస్తాను అని రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 90వ దశకంలో రాఘవేంద్ర రావు చిత్రాల్లోని ఈ తరహా పాటలు బాగా అలరించాయి. రంభ, నగ్మ, రమ్య కృష్ణ, దీప్తి భట్నాగర్ వీరితో పాటు దర్శకేంద్రుడి చిత్రాల్లో నటించిన ఇతర హీరోయిన్లపై కూడా పూలు, పళ్లతో ప్రయోగం చేశారు.