
`జబర్దస్త్` యాంకర్ అనసూయ(Anasuya) టాలీవుడ్‌లో పాపులర్ యాంకర్. సుమ, శ్రీముఖి, రష్మిలతోపాటు యాంకర్‌గా రాణిస్తుంది. అయితే క్రేజ్ పరంగా అనసూయ రేంజ్ వేరు. ఆమెకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఆమె గ్లామర్ ఫోటోలు షేర్ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా అది ఇంటర్నెట్‌లో దుమ్ము దుమారం చేస్తుంది. ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. అనసూయ అనే నటి ఉందనే విషయాన్నికూడా ఇది మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకెళ్లింది. అంతటి పాపులారిటీని `జబర్దస్త్`(Jabardasth Show) తనకి తీసుకొచ్చింది.
ఇటీవల అనసూయ(Anchor Anasuya) `జబర్దస్త్`ని వీడింది. ఈ సందర్భంగా పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్, వల్గర్ కామెంట్లు, నిర్వాహణ హౌజ్‌పై కూడా ఆమె విమర్శలు చేస్తూ బయటకొచ్చింది. ఆ షో స్థానంలో `సూపర్ సింగర్ జూనియర్`కి యాంకర్‌గా చేసింది. ఇది ఇప్పటికే అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క షో కూడా లేదు. కానీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే షూటింగ్‌లు లేకపోతే ఖాళీనే. ఫ్రీగా ఉన్న కారణంగా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పింది అనసూయ. టీవీ షోస్‌లో ఎప్పుడు కనిపిస్తారన్న ప్రశ్నకి, ఇప్పుడు టీవీకి బ్రేక్ తీసుకున్నా అని, ఏదైనా ఎగ్జైటింగ్ షో వచ్చేంత వరకు ఇంతే అని వెల్లడించింది. ఈ సందర్భంగా `జబర్దస్త్` గురించి ప్రశ్నించాడో నెటిజన్లు. ఈ సమయంలో `జబర్దస్త్`ని మిస్ అవుతున్నారా? అన్ని అడగ్గా, దానికి అనసూయ రియాక్ట్ అవుతూ దానిపై పాజిటివ్‌గా స్పందించింది.
`అప్‌కోర్స్(జబర్దస్త్ ని మిస్ అవుతున్నా), ఆ షోకి తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడ మీరు ఉండాలనుకుంటారో, అక్కడ ఉండ కూడదు. ఆ సమయంలో కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది` అని పేర్కొంది. `జబర్దస్త్` షో మానేయడంలో తాను కష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇంకో మంచి స్థానంలో ఉండాలంటే ఇక్కడ ఉండ కూడదనే అర్థంలో ఆమె ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది.
అనసూయ ప్రతి వారం `జబర్దస్త్` షో కోసం ఫోటో షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ పోజులిస్తూ అందాల ఆరబోస్తూ ఆమె దిగే ఫోటోలు అభిమానులను, నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటూ విజువల్ ట్రీట్‌నిస్తుంటారు. అందాలకు సంబంధించిన విందు భోజనం పెడుతుంటారు. ఈక్రమంలో ఆమె ఫోటోలు కొన్నిసార్లు ట్రోల్స్ గురవుతుంటాయి. డ్రెస్‌పై విమర్శలు వస్తుంటాయి. వీటన్నింటికి ఘాటుగా రియాక్ట్ అవుతూ వారి నోళ్లు మూయిస్తుంటుంది. కానీ ఏదో రూపంలో తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ వార్తల్లో నిలుస్తుంటుంది.
అయితే `జబర్దస్త్` మానేయడంతో ఆమె గ్లామర్ ఫోటోలు లేవు. ఇంట్లో దిగిన సెల్ఫీ ఫోటోలు అడపాదడపా తప్ప ఆమె గ్లామర్ మిస్ అవుతుంది. అదే బాధని నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు. మా గ్లామర్ ఫోటో షూట్ మిస్ అవుతున్నామని అడగ్గా, `అయ్యో.. త్వరలోనే ప్లాన్` చేస్తానని తెలిపింది అనసూయ. గ్లామర్ షో చేస్తూ చిలిపిగా కుర్రాళ్లని గెలికే అనసూయ ఇప్పుడు సైలైంట్ కావడంతో ఏదో మిస్ అయిన ఫీలింగ్‌లో ఉండిపోతున్నారు ఆమె అభిమానులు. మరి వారి కోరికని నెరవేరుస్తుందా? చూడాలి.
ఇదిలా ఉంటే అనసూయ `జబర్దస్త్`ని వీడిన అనంతరం రష్మి ఆ స్థానంలో యాంకర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్లపాటు రష్మినే చూసుకున్నారు. ఇటీవల కొత్త యాంకర్ సౌమ్య రావుని తీసుకొచ్చింది. కన్నడ భామ అయిన సౌమ్య రావు, సీరియల్ నటిగా, యాంకర్‌గా రాణిస్తున్నారు. ఆ మధ్య ఈటీవీ ప్రోగ్రామ్‌లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు `జబర్దస్త్`కి యాంకర్‌గా ఛాన్స్ కొట్టారు. సౌమ్య రావు వచ్చాక షోకి ఆదరణ మరింతగా పెరిగిందని టాక్. ఆమెని చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు ఆడియెన్స్ ఈ కామెడీ షోని చూస్తున్నారు గుసగుసలు వినిపిస్తున్నాయి.