ఆ పిల్లకి పెళ్లైంది పనికిరాదన్నారు.. పవన్‌ కాలిగోటికి సరిపోవన్నారుః అనసూయ సంచలన వ్యాఖ్యలు..

Published : Apr 04, 2021, 07:10 PM IST

అనసూయ అంటే సంచలనం.. అది వివాదమైనా, బోల్డ్ నెస్‌ అయినా, డేరింగ్‌కైనా. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అనసూయ. అవకాశాలడిగే, ఫ్యాకేజ్‌ అడుగుతున్నారట. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌ కాలి గోటికి సరిపోవన్నారట. అనసూయ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది.   

PREV
19
ఆ పిల్లకి పెళ్లైంది పనికిరాదన్నారు.. పవన్‌ కాలిగోటికి సరిపోవన్నారుః అనసూయ సంచలన వ్యాఖ్యలు..
జబర్దస్త్ షోతో పాపులర్‌ అయ్యింది అనసూయ. ఆ తర్వాత క్రమంగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఐటెమ్‌ సాంగ్‌లు కూడా చేసింది. `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్రతో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు క్రేజీ యాంకర్‌గా, నటిగా, స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది.

29
ఈ నేపథ్యంలో అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఐ డ్రీమ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర, వివాదాస్పద విషయాలను వెల్లడించింది. అంతేకాదు పలు షాకింగ్‌ కామెంట్స్ కూడా చేసింది. తాజాగా ఆ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

39
తాను పెద్ద పెద్ద హీరోలతో స్సెషల్‌ సాంగ్‌లు చేస్తున్నానని, ఐటెమ్‌ కాదని తెలిపింది. `దర్‌ ది డిస్కో` చేసినప్పుడు షారూఖ్‌ ఖాన్‌ని ఎందుకు ఐటెమ్‌ బాయ్‌ అనలేదని ప్రశ్నించింది. మమ్మల్ని మాత్రం ఐటెమ్‌ గర్ల్ అంటున్నారని వాపోయింది. అయితే మీడియా, ప్రెస్‌ దీన్ని ఫోకస్‌ చేస్తుందని చెప్పిందని, `అనసూయ కాంట్రవర్షియల్‌, అనసూయ ఐటెమ్‌ గర్ల్` అంటూ కోట్స్ లో పెడుతున్నారని వాపోయింది.

49
తెరవెనుక ఎలా ఉన్నామనేది ఎవరికీ అవసరం లేదని, కెమెరా వచ్చిందంటే అందంగా కనిపించాలని చెప్పింది అనసూయ. నేను వేసే డ్రెస్సులపై కామెంట్‌ చేస్తుంటారని, సోషల్‌ మీడియాలో ఒక్క ఫోటో పెడితే, `ఇవన్నీ అవసరమా? ఆంటి ఇంట్లో పిల్లలను చూసుకోవచ్చు కదా?` అని అంటారు.. వాళ్లే మా పిల్లలను పోషించినట్టు ఫీలవుతుంటారు` అని ఫైర్‌ అయ్యింది అనసూయ.

59
అంతేకాదు తన బాడీ విషయంలో తన ప్రౌడ్‌గా ఫీలవుతానని చెప్పింది. తన పొట్ట అంత ఉంది కాబట్టే, తన పిల్లలు జాగ్రత్తగా, కంఫర్టబుల్‌గా పొట్టలో ఉన్నారని, బాగా పెరిగారని చెప్పింది. ఎవరు ఏదో అనుకుంటారని తాను అస్సలు ఫీల్‌ అవ్వను అని చెప్పింది. ఇదే విషయం బయటకు ఏదైనా అయితే కుటుంబాలు కుటుంబాలు గొడవపడి చంపేసుకుంటారని చెప్పింది.

69
నన్ను డిజైరబుల్ లిస్ట్‌లో పెట్టారు.. నన్ను అవమానించారు.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డును రిటర్న్ ఇచ్చేశాను అని అనసూయ వాపోయింది. ఓ సారి రాత్రి రెండు గంటల సమయంలో నేను తాగి ఉన్నాను.. అని అనసూయ చెప్పింది. నువ్ తాగుతావా? అని అనసూయను యాంకర్ అడిగితే.. హా అవును కూల్‌డ్రింక్‌ అన్నట్టుగా కవర్‌ చేసింది అనసూయ.

79
ఒకప్పుడు `ఆ పిల్లకు పెళ్లైపోయింది. పనికిరాదు` అన్నారట. ఇప్పటికీ చాలా మంది ఉన్నారని చెప్పింది. అదేంటనేది సస్పెన్స్ లో పెట్టింది. బల్లగుద్ది చెప్పగలను.. తాను వాళ్లకంటే బాగా పర్‌ఫెర్మె చేస్తానని అనసూయ చెప్పింది.

89
`రంగమ్మత్త` తర్వాత రావడం లేదు ఎందుకంటే దానితోపాటు ప్యాకేజింగ్‌ అడుగుతున్నారని చెప్పింది. దీంతో యాంకర్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. అయితే ప్యాకేజింగ్‌ మీనింగ్‌ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

99
పవన్‌ కళ్యాణ్‌ నటించిన `అత్తారింటికి దారేదీ`లో `ఇట్స్ టైం టు పార్టీ` అనే పాటలో అడిగారని, కానీ తాను ఒక్కదాన్నే అయితే చేస్తానని అనసూయ చెప్పిందట. అందుకు వాళ్లు.. నువ్ పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవ్` అని అన్నారట. సరేలే నెక్ట్స్ టైమ్‌ చూసుకుందామనుకుందట. అయితే వీళ్లల్లో ఓవర్‌ యాక్టింగ్‌ బ్యాచ్‌ ఉంటారని చెప్పింది అనసూయ. దీంతోపాటు మీరు చేయకపోతే మరో అమ్మాయి అని అన్నారట. అన్ని ఇండస్ట్రీలు ఇలానే తీసుకోండని చెప్పింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories