సోషల్ మీడియాలో యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయ భారీ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. వారి డ్రెస్సింగ్, ఫోటో షూట్స్, వీడియోలను పై దారుణ కామెంట్స్ చేస్తుంటారు. అనసూయ రియాక్ట్ అవుతారు కానీ రష్మీ పెద్దగా పట్టించుకోరు. అయితే ఆమె కూడా పంథా మార్చింది. రష్మీ గౌతమ్ ని ఓ నెటిజన్ దండం పెట్టి మరీ వేడుకున్నాడు. అయినా వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ లో కేసు పెడతానంటూ భయపెట్టింది.