‘లైగర్’(Liger) హీరోయిన్ అనన్య పాండే గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. తన బ్యూటీతో నెటిజన్లను ఆకర్షించేందుకు నిరంతర యుద్ధం చేస్తోంది. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ మతిపోగొడుతోంది.
అందానికే అందం అద్దినట్టు ఉంటుంది అనన్య. అద్దం కూడా కుళ్లుకునేంత అందం ఆమెది. నాజుకు నడుముతో.. ఒంపు వయ్యారాలతో కట్టిపడేయడంలో ఆమె రూటే సెపరేటు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
36
అనన్య గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొన్నటికి మొన్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ‘గెహ్రైయాన్’(Gehraiyaan) మూవీలో బోల్డ్ సీన్లలోనూ నటించిందీ సుందరి. ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు.
46
అనన్య అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో హై ఫాలోయింగ్ ఉండటంతో తాజాగా అనన్య పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 5 లక్షల లైక్ లను సొంతం చేసుకుంది.
56
అయితే అనన్య లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘హలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు నెటిజన్లు, అభిమానులు కూడా అనన్యకు కామెంట్ బాక్స్ లో తిరిగి హలో చెబుతున్నారు. అభిమానులతో పాటు నటి, ప్రొడ్యూసర్ చార్మి కౌర్ (Charmme Kaur) లైక్ చేసింది.
66
అనన్య లేటెస్ట్ ఫొటోట్లో స్లీవ్ లెస్ బ్లాక్ లేస్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ ఇచ్చింది. మత్తెక్కించే చూపులతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. పోనీ టేయిల్ వేసుకున్న బార్బీ డాల్ లా కనిపిస్తోంది. ప్రస్తుతం అనన్య పాండే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండకు జోడీగా లైగర్ లో నటిస్తోంది. ఆగస్ట్ 25న లైగర్ రిలీజ్ కాబోతోంది.