రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. బ్యూటీఫుల్ ఫొటోస్ తో అనౌన్స్ చేసిన జంట.. ఎక్కడ జరిగిందంటే?

First Published | Nov 5, 2023, 6:59 PM IST

మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఇక వారంపదిరోజుల్లోనే పెళ్లి కూడా చేసుకుంది. తాజాగా వీరి వెడ్డింగ్ షూట్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తమ వివాహా బంధాన్ని తెలియజేశారు. 
 

కాబోయే భర్తను పరిచయం చేసిన పదిరోజుల్లోనే అమలాపాల్ (Amala Paul) రెండో పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ (Jagat Desai)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ శుభవార్తను తానే  స్వయంగా ప్రకటించింది. 
 

ఇన్ స్టా వేదికన అమలాపాల్, జగత్ దేశాయ్ తమ పెళ్లి ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈరోజు మ్యారేజ్ చేసుకున్నట్టు నూతన జంట ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


వెడ్డింగ్ పిక్స్ ను పంచుకుంటూ అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చారు. ‘రెండు హృదయాలు, ఒకే గమ్యం. ఈ జీవితాంతం నా దివ్యమైన స్త్రీతో చేయి చేయి కలిపి నడుస్తూనే ఉంటాయి. #పెళ్లి’ అంటూ రాసుకొచ్చారు. తమ మ్యారేజ్ ముగిసిందని ప్రకటించారు. 
 

వీరి పెళ్లి కేరళలోని గ్రాండ్ హయత్ కొచ్చి బోల్గట్టి అనే లగ్జరీ రిసార్ట్ లో జరిగినట్టు తెలుస్తోంది. తమతమ సంప్రదాయాల్లో మ్యారేజ్ ముగిసిన తర్వాత నూతన జంట బ్యూటీఫుల్ లోకేషన్లలో ఫొటోషూట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోగా నెట్టింట వైరల్ అయ్యాయి. 
 

అమలాపాల్ బ్యూటీఫుల్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఇక జగత్ దేశాయ్ అమలాపాల్ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే షేర్వానీలో అదరగొట్టారు. ఇక బ్యూటీఫుల్ ఫొటోషూట్ తో ఆకట్టకుంటున్నారు. రొమాంటిక్ ఫోజులతో అట్రాక్ట్ చేశారు.

ఇక అమలాపాల్ 2014లోనే దర్శకుడు ఏల్ విజయ్ ని పెళ్లి చేసుకుంది. మూడేళ్ల కాపురం తర్వాత విడాకుల తీసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గానే జీవితం గడుపుతూ వచ్చింది. ఇక తాజాగా రెండోసారి జగత్ దేశాయ్ ని పెళ్లి చేసుకుంది. 
 

Latest Videos

click me!