Amala Paul : ‘నేనే కాదు... నా భర్త కూడా ప్రెగ్నెంటే’.. ఫొటోలతో షాక్ ఇచ్చిన అమలా పాల్!

Published : Jan 13, 2024, 10:21 PM IST

అమలాపాల్ Amala Paul త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వరుసగా బేబీ బంప్ తో ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా తన భర్త కూడా ప్రెగ్నెంట్ అంటూ కొన్ని ఫొటోలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.  

PREV
16
Amala Paul :  ‘నేనే కాదు... నా భర్త కూడా ప్రెగ్నెంటే’.. ఫొటోలతో షాక్ ఇచ్చిన అమలా పాల్!

మలయాళీ నటి, స్టార్ హీరోయిన్ అమలాపాల్ త్వరలో  తల్లిగా ప్రమోషన్ అందుకోబోతున్నారు. ఇటీవలనే తన ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బేబీ బంప్ చూపిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది.

26

ఈ క్రమంలో రకరకాలుగా ఫొటోషూట్లతో తల్లి కాబోతున్న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. భర్తతో కలిసి కూడా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు చేస్తూ సంతోషపడుతోంది. ఫ్యాన్స్ ను కూడా ఖుషీ చేస్తోంది. 
 

36

ఆ ఫొటోలను వెన్వెంటనే తన అభిమానులతోనూ షేర్ చేసుకుంటోంది. బేబీ బంప్ లో ఫొటోలకు ఫోజులిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు. హెల్త్ పైనా మరింత శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నారు. 
 

46

ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఆసక్తికరమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన భర్తతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ కొన్ని బేబీ బంప్ పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఆ ఫొటోలకు ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది.

56

‘మీకు తెలుసా? భార్య ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పురుషుడి పొట్ట దాదాపు అంత పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి! ఇది అలాంటి సమయమే.. ’ఆమె గర్భవతి’ మాత్రమే కాదు.. ‘మేము గర్భవతి!’ క్షమించండి హజ్బెండ్.’ అంటూ చెప్పుకొచ్చింది. 
 

66

ఇక అభిమానులు అమలాపాల్ ఫొటోలపై స్పందిస్తూ... భర్త కూడా ప్రెగ్నెంటే.. ఎందుకంటే తను గుండెలా నిండా బేబీని మోస్తూ ఉంటాడు కాబట్టి అంటూ.. అమలాపాల్ పోస్ట్ ను సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.  

click me!

Recommended Stories