`వాలిమై` ఆఫరొచ్చిన ఆనందంలో క్యూట్‌ అండ్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోతున్న బన్నీ సిస్టర్‌.. ఆ నడుముకి అంతా ఫిదా

First Published | Sep 29, 2021, 7:02 PM IST

అల్లు అర్జున్(allu arjun) హీరోగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలో ఐకాన్ స్టార్‌కి సిస్టర్‌గా మెరిసింది వైష్ణవి చైతన్య(vaishnavi chaitanya). ఇప్పుడు ఏకంగా అజిత్‌తో కలిసి నటిస్తుంది.ఈ ఆనందంలో తన గ్లామర్‌ పిక్స్ తో కుర్రాళ్లని హంట్‌ చేస్తుంది. 

టిక్‌టాక్‌ స్టార్‌గా పాపులర్‌ అయ్యింది వైష్ణవి చైతన్య. విజయవాడకి చెందిన ఈ క్యూట్‌ అందాల భామ టిక్‌ టాక్‌లో అనేక పాటలకు, డైలాగ్‌లకు పర్‌ఫెక్ట్ లిప్‌ సింక్‌ ఇవ్వడంతోపాటు అద్భుతమైన హవభావాలతో మెస్మరైజ్‌ చేసింది. 

యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుని సోషల్‌ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌4 ఫేమ్‌ మెహబూబ్‌ దిల్‌ సేతో కలిసి అనేక టిక్‌టాక్‌ వీడియోలు చేసింది. ఆయనతోపాటు పాపులర్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.


2019లో కంపనీ ఇన్ఫినిటీ మీడియా సంస్థ ఆమెతో `సామజరవగమన` వీడియో కవర్‌ సాంగ్‌ చేయించింది. ఇందులో వైష్ణవి అద్భుతమైన పర్‌ఫెర్మెన్స్ నెటిజన్లని ఫిదా చేశాయి. అంతేకాదే ఏకంగా బన్నీతో కలిసి నటించే అవకాశం తెచ్చిపెట్టింది. 

అదే ఏడాది `అబ్బనీ తీయనీ దెబ్బ` అనే కవర్‌ సాంగ్‌ చేయగా, అది యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. వైష్ణవికి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది.
 

వైష్ణవికి తన పేరుతోనూ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. ఇందులో తన వీడియోలు, వీడియో సాంగ్ లు, ఫన్నీ వీడియోలు చేస్తూ డిజిటల్‌ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది.
 

ఈ క్యూట్‌ అండ్‌ హాట్‌ అందాల భామకి బిగ్‌ సినిమా ఆఫర్‌ వచ్చింది. అల్లు అర్జున్‌తో `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇందులో బన్నీ సిస్టర్‌గా కనిపించింది. ఈ సినిమా వైష్ణవికి ఓ విజిటింగ్‌ కార్డ్ లా ఉపయోగపడింది. పెద్ద బూస్ట్ ఇచ్చింది. 

వైష్ణవ్‌ షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌ కూడా చేసింది. షణ్ముఖ్‌తో కలిసి `ది సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్‌` అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. షణ్ముఖ్‌ టీమ్‌లో ఒకరిగా బిజీ అయ్యింది వైష్ణవి. 

ప్రస్తుతం వైష్ణవి తెలుగులో `వరుడు కావలెను` చిత్రంలో నటిస్తుంది. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న చిత్రమిది. రిలీజ్ కిది రెడీ అవుతుంది. మరోవైపు తమిళంలోనూ ఓ బిగ్‌ ప్రాజెక్ట్ లో నటించే అరుదైన అవకాశం వైష్ణవిని వరించింది. 
 

కోలీవుడ్‌ `తలా` అజిత్‌ నటిస్తున్న `వాలిమై` చిత్రంలో కీలక పాత్ర పోసిస్తుంది. ఈ మేరకు ఆమె అజిత్‌తో దిగిన ఫోటోని పంచుకుని ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. 

సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న వైష్ణవికి ఓ లవర్‌ కూడా ఉన్నాడని టాక్‌. అభిషేక్‌ కర్పూరంతో రిలేషన్‌లో ఉందని సోషల్‌ మీడియా టాక్. ఆ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

ఇదిలా ఉంటే గ్లామర్‌ పరంగానూ వైష్ణవి తగ్గేదెలే అంటోంది. హాఫ్‌ శారీలో నడుమందాలను చూపిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన పోజులు, పంచుకున్న ఫోటోలు నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. మరోవైపు క్యూట్‌ లుక్‌తోనూ కుర్రాళ్లని హంట్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ.  

యూట్యూబర్‌, టిక్ టాక్‌ స్టార్‌, నటి వైష్ణవి చైతన్య క్యూట్‌ లుక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో నెటిజన్లకి గిలిగింతలు పెడుతున్నాయి. 

యూట్యూబర్‌, టిక్ టాక్‌ స్టార్‌, నటి వైష్ణవి చైతన్య క్యూట్‌ లుక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో నెటిజన్లకి గిలిగింతలు పెడుతున్నాయి. 

Latest Videos

click me!