రాంచరణ్ కుమార్తెకి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ దంపతులు.. ఏకంగా బంగారు అక్షరాలతో

Published : Aug 02, 2023, 04:04 PM ISTUpdated : Aug 02, 2023, 04:05 PM IST

రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు నిచ్చింది. దీనితో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు.  

PREV
16
రాంచరణ్ కుమార్తెకి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ దంపతులు.. ఏకంగా బంగారు అక్షరాలతో

  రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు నిచ్చింది. దీనితో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు.  సాంప్రదాయ బద్దంగా మెగా వారసురాలికి క్లీంకార అని నామకరణం చేశారు. చిన్నారికి లలితా సహస్ర నామంలోని పదాలు కలిసేలా.. అమ్మవారి ఆశీర్వాదం శక్తి తోడయ్యేలా ఈ పేరు పెట్టినట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి క్లీంకార కొణిదెల KKK అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది.  

 

26

చరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె పుట్టగానే చాలా మంది సెలెబ్రిటీలు బహుమతులు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఎవరెవరు ఎలాంటి  గిఫ్ట్స్ పంపారు అనేది బయటకి రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా మెగా ఫ్యామిలీ నుంచే క్లీంకారకి చాలా కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందట. ఆ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదు.. అల్లు అర్జున్, అల్లు స్నేహ దంపతులు అని ప్రచారం జరుగుతోంది. 

 

36

అల్లు అర్జున్.. క్లీంకారకి ఇచ్చిన గిఫ్ట్ ఓ నేమ్ ప్లేట్ అని సంచారం. నేమ్ ప్లేట్ కాస్ట్లీ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా.. ఆ నేమ్ ప్లేట్ లోని అక్షరాలని బన్నీ గోల్డ్ తో చేయించాడట. అంతే కాదు నేమ్ ప్లేట్ చుట్టూ డైమండ్స్ కూడా డిజైన్ చేశారట. 

 

46

ఏది ఏమైనా అల్లు అర్జున్.. రాంచరణ్ కుమర్తెకి ఎప్పటికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన చాలా కాలం తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ మెగా కాంపౌండ్ మురిసిపోతోంది. 

 

56

తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా ఉపాసన, చరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారి క్లీంకార కోసం రాంచరణ్, ఉపాసన ఒక ప్రత్యేక గదిని బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో రెడీ చేశారు. 

 

66

అంటే అత్యాధునిక హంగులు అని అర్థం కాదు.. చిన్నారి పెరిగేందుకు మంచి వాతావరణం ఉండేలా.. పిల్లలు కోరుకునే బొమ్మలు ఉండేలా ఈ గదిని డిజైన్ చేశారు. ఈ వీడియో ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

 

Read more Photos on
click me!

Recommended Stories