సమంతని ఎత్తుకుని అక్షయ్‌ కుమార్‌ రచ్చ రచ్చ.. డాన్సు చేస్తూ రెచ్చిపోయిన స్టార్స్.. పెళ్లిపై సామ్‌ ఏమన్నదంటే?

Published : Jul 19, 2022, 08:19 PM ISTUpdated : Jul 19, 2022, 09:13 PM IST

సమంత ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమెని అక్షయ్‌ కుమార్‌ ఎత్తుకున్నా ఎలాంటి కంప్లెయింట్స్ లేదని చెప్పడం విశేషం. అంతేకాదు మ్యారేజ్‌పై మరోసారి షాకింగ్‌ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది సామ్‌. 

PREV
18
సమంతని ఎత్తుకుని అక్షయ్‌ కుమార్‌ రచ్చ రచ్చ.. డాన్సు చేస్తూ రెచ్చిపోయిన స్టార్స్.. పెళ్లిపై సామ్‌ ఏమన్నదంటే?

స్టార్‌ హీరోయిన్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ ముద్ర వేసుకుంటోన్న సమంత(Samantha) సౌత్‌ టూ నార్త్ దున్నేస్తుంది. దూసుకుపోతుంది. భారీ ఆఫర్లతో కెరీర్‌ పరంగా మరో మైల్‌ స్టోన్‌ని చేరుకుంటుంది. అదే సమయంలో అరుదైన ఘనతని సాధించింది. ఆమె లేటెస్ట్ గా `కాఫీ విత్‌ కరణ్‌` (Koffee with Karan) టాక్‌ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రోమో విడుదలైంది.

28

బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్ కరణ్‌ జోహార్‌(Karan Johar) హోస్ట్ గా నడిచే ఈ షోలో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)తో కలిసి పాల్గొంది సమంత. `కాఫీ విత్‌ కరణ్‌` సీజన్‌ 7లో భాగంగా విడుదలైన లేటెస్ట్ ప్రోమో ఇది. ఇందులో సమంత, అక్షయ్‌ కుమార్‌ మధ్య జరిగిన సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సీన్లు నోరెళ్లబెట్టేలా ఉన్నాయి. 

38

ఇందులో కరణ్‌ జోహార్‌ సమంత, అక్షయ్‌ లను ఆహ్వానించగా, వస్తూ వస్తూ అక్షయ్‌.. సమంతని ఎత్తుకుని షోకి రావడం విశేషం. వీరిద్దరు ఎంతో సరదాగా, ఫన్నీగా ఎంట్రీ ఇచ్చారు. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎత్తుకుని వస్తుండగా, కరణ్‌ జోహార్‌ సైతం షాక్‌ అయ్యారు. వచ్చాక కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సమంత చెప్పిన సమాధానాలు మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. 
 

48

షోకి వచ్చాక అక్షయ్‌ ని ఉద్దేశించి కరణ్‌ చెబుతూ, మీకు తెలుసా మీరు నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌ని మీ నెంబర్‌ వన్‌ భుజాలపై తీసుకొచ్చారు అని అన్నారు. దీనికి సమంత స్పందిస్తూ నాకు ఎలాంటి కంప్లెయింట్స్ లేవని చెప్పడం విశేషం. అక్షయ్‌ నవ్వులు పూయించారు.

58

ఆ తర్వాత సమంత మ్యారేజ్‌ లైఫ్‌ గురించి కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. దీంతో మధ్యలోనే కల్పించుకున్న సమంత.. అన్‌ హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌కి మీరు ఒక కారణం అని చెప్పడం విశేషం. గతంలోనూ మొత్తం సీజన్‌ షోకి సంబంధించిన ప్రోమోలోనూ సమంత చెప్పిన ఈ ఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రోమోలోనూ ఇది హైలైట్‌గా నిలవడం విశేషం. ఇందులో సమంత తన పెళ్లి గురించి ఏం చెప్పబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 
 

68

మరోవైపు మీ ఫ్రెండ్‌ బ్యాచ్‌లరేట్‌ పార్టీలో హోస్ట్ చేయాల్సి వస్తే, మీరు ఏ ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్ తో డాన్సు చేయిస్తారని కరణ్‌ అడిగిన ప్రశ్నకి సమంత చెబుతూ, `రణ్‌ వీర్‌ సింగ్‌ అండ్‌ రణ్‌వీర్‌ సింగ్‌`తో అని చెప్పడం నవ్వులు పూయించింది. దీనికి కరణ్‌ `హో.. `అని ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌ ఆకట్టుకుంటుంది.
 

78

ఈ రౌండ్‌ తర్వాత కరణ్‌ మరో గేమ్‌ పెట్టాడు. ఇందులో తెలిసిన ఆన్సర్‌కి బజర్స్ నొక్కాల్సి ఉంటుంది. ఈ రౌండ్‌లో అక్షయ్‌, సమంత రెచ్చిపోయారు. బజర్స్ నొక్కుతూ హంగామా చేశారు. అ తర్వాత డాన్సు చేయాలని కరణ్‌ కోరగా ఇద్దరూ మరింతగా రెచ్చిపోయి డాన్సు చేశారు. 

88

జిగ్‌జాగ్‌ డాన్సులో అక్షయ్‌, సమంత డిఫరెంట్‌గా డాన్సు చేస్తూ నవ్వులు పూయించారు. అయితే ఇందులో అల్లు అర్జున్‌ని అక్షయ్‌ ఇమిటేట్‌ చేశారు. `పుష్ప తగ్గేదెలే` అన్నట్టుగానే ఆయన చేయి తిప్పి మరీ డాన్సులు చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ షోలోని అక్షయ్‌- సమంత ఎపిసోడ్‌ ఈ నెల 21న సాయంత్రం ఏడుగంటలకు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories