Ram Charan-Akhil: రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది` సినిమా కోసం అఖిల్ అక్కినేని వెనక్కి తగ్గాడు. తన సినిమాని వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.
రామ్‌చరణ్, అఖిల్ మధ్య మంచి స్నేహం ఉంది. అది ఇప్పటిది కాదు, చాలా ఏళ్లుగా ఆ స్నేహం కొనసాగుతుంది. చిరంజీవి, నాగార్జున మధ్య ఎలాంటి స్నేహం ఉందో, అదే విధంగా, చరణ్, అఖిల్ ల మధ్య కూడా అలాంటి అనుబంధమే ఉంది. సినిమాల్లోకి రాకముందు నుంచే ఈ బాండింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చరణ్ కోసం అఖిల్ వెనక్కి తగ్గాడు. రామ్ చరణ్ పై ఉన్న గౌరవంతో, ఆరోగ్యకరమైన సినిమా వాతావరణం కోసం అఖిల్ బ్యాక్ అయ్యాడు.
25
పెద్దితో రాబోతున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల షూటింగ్ రామ్ చరణ్‌కి గాయమైనప్పటికీ దాన్ని లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. శ్రీరామ నవమి సందర్భంగా సినిమా గ్లింప్స్ ని విడుదల చేయగా, రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో, కుస్తీ వీరుడిగా చరణ్ ఇందులో కనిపిస్తారని టీమ్ తెలిపింది.
35
లెనిన్‌తో రాబోతున్న అఖిల్
ఇక అక్కినేని అఖిల్ వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు `లెనిన్` అనే చిత్రంలో నటిస్తున్నారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రేమ కథా నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రేమ కోసం తిరుగుబాటు ప్రధానంగా మూవీ కథ సాగుతుందని సమాచారం. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట శ్రీలీలని ఎంపిక చేశారు. కానీ అనుకోని కారణాలతో ఆమె తప్పుకుంది. దీంతో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. బెస్ట్ ఔట్‌పుట్ కోసం టీమ్ శ్రమిస్తోంది. అఖిల్ హీరోగా నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ఈ క్రమంలో ఇప్పుడుఈ చిత్రంతో అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న డేట్ ప్రకారం ఈ సినిమా మే 1న రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాయిదా వేశారు. రామ్ చరణ్ `పెద్ది` సినిమా కోసం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలిపింది టీమ్. రామ్ చరణ్‌తో ఉన్న రిలేషన్, సినిమా మధ్య పోటీ ఉండకూడదని, సినిమాని అంతా సెలబ్రేట్ చేసుకోవాలని, దాన్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పి, `లెనిన్`ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
55
లెనిన్ కొత్త రిలీజ్ డేట్
అందులో భాగంగానే కొత్త రిలీజ్ డేట్‌ని ఇచ్చారు. జూన్ 26న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సారి మంచి ఔట్‌పుట్‌తో, మంచి కంటెంట్‌తో, అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునే కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలిపింది టీమ్. ఇదిలా ఉంటే అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి 11ఏళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాడు. ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. హీరోగా నిలబడలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రంతో అయినా హిట్ కొడతాడా? అనేది చూడాలి.