అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్. జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.
అక్కినేని వారసుడిగా అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తొలి హిట్ కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అఖిల్ 5 సినిమాల్లో నటిస్తే ఆ 5 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అఖిల్ తొలి విజయం వాయిదా పడుతూనే ఉంది. ఈసారి హిట్ కొట్టకపోతే అభిమానుల్లో నిరాశ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అఖిల్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోవచ్చు.
25
లెనిన్ మూవీతో హిట్ కొట్టి తీరాలి
అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న లెనిన్ మూవీతో హిట్ కొట్టి తీరాలి. అఖిల్ చాకొలేట్ బాయ్ లా అందంగా ఉంటాడు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. పెర్ఫార్మెన్స్ కూడా బావుంటుంది. అయినా కూడా తొలి విజయం దక్కడం లేదు. అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ రాయలసీమ నేపథ్యంలో ప్రేమ కథగా తెరకెక్కుతోంది.
35
మురళి కిషోర్ దర్శకత్వం
ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మురళి కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దీనికి ఒక్క రోజు ముందు రాంచరణ్ పెద్ది చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో లెనిన్ వాయిదా పడొచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ అక్కినేని నాగార్జున ఆసక్తికర ట్వీట్ చేశారు. లెనిన్ జూన్ 26న రిలీజ్ అవుతుంది అని కంఫర్మ్ చేశారు. పనిలో పనిగా లెనిన్ ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత కూడా. నాగార్జున ట్వీట్ చేస్తూ.. లెనిన్ మూవీ ఫస్ట్ కట్ ని రాత్రి చూశాను. మూవీ చూశాక కాన్ఫిడెన్స్ తో గర్వంగా చెబుతున్నా. మీరు సరికొత్త అఖిల్ ని చూస్తారు.
55
నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
జూన్ 26, 2026 ఈ తేదీని మార్క్ చేసి పెట్టుకోండి. థియేటర్స్ లో కలుద్దాం అంటూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున కాన్ఫిడెన్స్ చూస్తుంటే అఖిల్ తన ఆరవ చిత్రంతో పక్కాగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికి వరుసగా 5 ఫ్లాపులు పడ్డాయి. ఆరో చిత్రంతో అఖిల్ సత్తా చాటబోతున్నట్లు నాగార్జున మాటల్లో అర్థం అవుతోంది.