Purna: కొత్త షో కోసం సరికొత్తగా సిద్ధమైన ముద్దుగుమ్మ పూర్ణ... సిల్క్ చుడిదార్ లో కిక్కిస్తున్న అందాలు!

Published : Jan 30, 2022, 12:26 PM IST

డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా దుమ్మురేపింది పూర్ణ (Purna) కొత్త షోలో సరికొత్తగా మెరిశారు. నటుడు నాగబాబు పక్కన కూర్చొని హాస్యం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కామెడీ షో కోసం చందమామ లాంటి అందంతో ఆకట్టుకున్నారు.

PREV
110
Purna: కొత్త షో కోసం సరికొత్తగా సిద్ధమైన ముద్దుగుమ్మ పూర్ణ... సిల్క్ చుడిదార్ లో కిక్కిస్తున్న అందాలు!

లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు. ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పూర్ణతో పాటు సుడిగాలి సుధీర్, యాంకర్స్ రష్మీ (Rashmi gautam) , దీపికా పిల్లిని కూడా తప్పించడం విశేషం. వీరందరి నిష్క్రమణతో షోలో కొంచెం ఊపు తగ్గింది.

210

అయితే స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోకి పూర్ణ జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ కి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కామెడీ స్టార్స్ షోని సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా నాగబాబును జడ్జిగా రంగంలోకి దించారు. తాజాగా పూర్ణ సైతం జడ్జి సీటులో కూర్చున్నారు. ఆమె పూర్తి స్థాయిలో కొనసాగుతారా? లేక కొన్ని రోజుల కోసమా అనేది తెలియాల్సి ఉంది.

310

ఓటిటి రిలీజ్ 3 రోజెస్ (3 Rojes) తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు.

410

ఇక నటిగా వచ్చ్హిన అవకాశం కాదనకుండా చేస్తున్నారు పూర్ణ. ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

510

సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఫ్యాన్ బేస్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఈ హాట్ బాంబ్ పంచుకునే ఫోటోలు, చేసే ఫోటో షూట్స్ పిచ్చ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా బ్లూ కలర్ ట్రెండీ వేర్ లో మనసులు దోచేశారు. పూర్ణ గ్లామర్ సూపర్ కిక్ ఇచ్చేలా ఉంది.

610

సీనియర్ స్టార్స్ చిత్రాలలో కీలక రోల్ చేస్తున్నారు పూర్ణ. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ లాయర్ రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ(Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషం అని చెప్పాలి. అఖండ భారీ విజయం సాధించింది. 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

710

అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.

810

కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.

910

డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా దుమ్మురేపింది పూర్ణ (Purna) కొత్త షోలో సరికొత్తగా మెరిశారు. నటుడు నాగబాబు పక్కన కూర్చొని హాస్యం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కామెడీ షో కోసం చందమామ లాంటి అందంతో ఆకట్టుకున్నారు. 

1010

డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా దుమ్మురేపింది పూర్ణ (Purna) కొత్త షోలో సరికొత్తగా మెరిశారు. నటుడు నాగబాబు పక్కన కూర్చొని హాస్యం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కామెడీ షో కోసం చందమామ లాంటి అందంతో ఆకట్టుకున్నారు. 

click me!

Recommended Stories