యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ‘ఆర్స్ ఎక్స్ 100’తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తొలిచిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ మతులు పోగొట్టింది. అప్పట్లో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.
కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి హిట్లు పడటం లేదు. తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చినా అక్కడా సరైన సినిమా పడట్లే. వచ్చిన చిత్రాలూ ఆశించిన ఫలితానివ్వలేదు. దీంతో మరోసారి తన ఫేవరెట్, ‘ఆర్ ఎక్స్100’ డైరెక్టర్ అజయ్ భూపతితో చేతులు కలిపింది.
వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం ‘మంగళవారం’ (Mangalavaaram) సినిమా రూపుదిద్దుకుంటోంది. పలు షేడ్స్ లో పాయల్ ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను కూడా ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు.
పాయల్ ఈ సినిమాపైనే ప్రస్తుతం ఆశలు పెట్టుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫిల్మ్ నుంచి అప్డేట్ అయితే అందుకుంది. ఈ క్రమంలోనే పాయల్ కూడా తన అభిమానులను మరింతగా ఆకట్టుకునేందుకు నెట్టింట సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. వన్ షోల్డర్, థైస్ అందాలతో మతులు పోగొట్టింది. లేక్ వ్యూ పాయింట్ వద్ద కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని దోచుకుంది. గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది. బ్యూటీఫుల్ స్మైల్, అదిరిపోయే స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు.
సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ పంజాబీ, హిందీ చిత్రాలతో నటిగా మారింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక్కడ ఆమె మొదటి చిత్రం మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. పెర్ఫామెన్స్ తోనూ అట్రాక్ట్ చేసింది. ‘సీత’, ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామా’, ‘డిస్కో రాజా’, ‘అనగనగ ఓ అతిథి’, ‘తీస్ మార్ ఖాన్’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.