అతి తర్వలో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించబోతోంది ఐశ్వర్య అర్జున్. యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ సరసన నటించబోతోంది. ఈ చిత్రానికి ఐశ్వర్య తండ్రి, సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమం పూర్తైంది. సెట్స్ పైకి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.