బుల్లితెరపై..
కిరణ్ కుమార్‌కు ‘అగ్గిపెట్టి మచ్చ’ అనే పేరు ఎలా వచ్చిందో కంటే, ఆ పేరుతో ఆయన సంపాదించుకున్న క్రేజ్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఆయన మాట్లాడే విధానం, డైలాగ్ డెలివరీ, ముఖ కవళికలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేవి. ఆయనకు సంబంధించిన వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యేవి. ఈ క్రేజ్‌తో పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. యూట్యూబ్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లోనూ కనిపించి తనదైన శైలిలో అలరించారు.