పదేళ్ల తర్వాత ఆయన ట్వీట్ కు త్రిష రిప్లై.. ఆ సీక్వెల్ కు రెడీ అంటున్న సౌత్ క్వీన్.. నిజంగానే సెట్ చేస్తారా?

First Published | Sep 12, 2023, 2:06 PM IST

పదేళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ట్వీట్ కు సౌత్ క్వీన్ త్రిష రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సిద్ధంగానూ ఉన్నట్టు డైరెక్టకు తెలియజేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 
 

సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishanan) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించి.. ‘వర్షం’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 

తొలిచిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. దాంతో వరుస ఆఫర్లు అందుకుంది. చిరంజీవి, నాగార్జన, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి బడా హీరోల సరసన నటించి మెప్పించింది. కొన్నేళ్ల పాటు దక్షిణాదిలో వెలుగొందింది. 
 


త్రిష నటించిన చిత్రాల్లో వెంకటేష్ సరసన నటించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే‘  ఎంతో ప్రత్యేకంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాను అభిమానులు, సినీ ప్రియులు చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

అయితే, 2013లో సెల్వరాఘవన్ AMAV చిత్రాన్ని మరోసారి చూశారు. ఈ సందర్భంగా వెంకీ, త్రిషతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందంటూ.. త్రిష, వెంకీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. పదేళ్ల తర్వాత ఆ ట్వీట్ కు తాజాగా స్పందించింది. 

‘నేను రెడీ’ అంటూ సెల్వరాఘవన్ ను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేసింది. దీంతో ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఊహించని విధంగా సీక్వెల్స్ సెట్ అవుతున్న తరుణంలో  త్రిష ఇలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై సెల్వ రాఘవన్ ఎలా స్పందిస్తారో అన్నది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
 

ఇదిలా ఉంటే.. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత మరిన్ని ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. అందులో తమిళ చిత్రం ‘ది రోడ్’ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లోనే త్రిష బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!