శ్రీలీలా నవ్విందంటే పునకాలే.. ‘ధమకా’ బ్యూటీ ఇంత అందంగా మెరిస్తే చూపు తిప్పుకోగలమా..

First Published | May 29, 2023, 3:54 PM IST

తెలుగు బ్యూటీ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఏలుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోల సరసన నటిస్తూ దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
 

తెలుగు బ్యూటీ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఏలుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోల సరసన నటిస్తూ దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
 

ప్రస్తుతం శ్రీలీలా అరడజన్ కు పైగా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. బిజీయేస్ట్ హీరోయిన్ గా మారింది. చిన్న వయస్సులోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుని ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 
 


ఇదే సమయంలో శ్రీలీలా ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. తన అభిమానులకు దగ్గరగా ఉంటూ ఇంటర్నెట్ లో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇందుకు ఎప్పటికప్పుడు తన బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తాజాగా శ్రీలీలా బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎక్కువగా ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కలర్ ఫుల్ చుడీదార్ లో ఫొటోషూట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.
 

వైట్ ప్రింటెడ్ చుడీదార్ లో శ్రీలీలా మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఆకర్షించే అందం, అందమైన కురులు, హృదయాలను కొల్లగొట్టే నవ్వుతో శ్రీలీలా సందడి చేసింది. మ్యాగ్నేట్ లాంటి చూపులతో నెటిజన్లను కట్టిపడేసింది. 
 

వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్న ఈ కుర్ర హీరోయిన్ తన నయా లుక్స్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ బ్యూటీఫుల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. కొంటె చూపుతో, క్యూట్ స్మైల్ తో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
 

శ్రీలీలా పంచుకున్న ఆ వీడియోను నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఎంత బిజీ అవుతున్న గ్లామర్ షోకు దూరంగా ఉంటున్న యంగ్ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మను ట్రెడిషనల్ లుక్ లో చూసేందుకే ఇష్టపడుతుంటారు. 
 

ప్రస్తుతం ఆ వీడియోను, శ్రీలీలా అందమైన లుక్ ను పొగడుతూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆకాశానికి ఎత్తుతున్నారు. పోస్ట్ ను వైరల్ గా మారుస్తున్నారు. ఇన్ స్టాలో శ్రీలీలాకు దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక శ్రీలీలా NBK108, ఉస్తాద్ భగత్ సింగ్, బోయపాటిరాపో, ఆదికేశవ, VD12, Nithiin32, SSMB28 చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!