రెస్టారెంట్ లో శ్రద్ధా దాస్ రచ్చ రచ్చ.. డ్రింక్స్ తాగుతూ బోల్డ్ బ్యూటీ చిందులు.. మైండ్ బ్లాక్

First Published | Mar 24, 2023, 3:21 PM IST

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das)  ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంగా కొన్ని ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 
 

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో  ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.  ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. 
 

ఇటీవల వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. అయితే బుధవారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్ కు సందర్శించిన సందర్భంగా ఫొటోలకు ఫోజులిచ్చింది.  ఆ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలాగే ఓ వీడియోనూ పంచుకుంది. 
 


టేస్టీ ఫుడ్, నాన్ ఆల్కహాలిక్ కాక్ టేయిల్, డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ లో అద్భుతమైన సాయంత్రాన్ని గడిపినట్టు తెలిపింది. తమను చాలా బాగా రిసీవ్ చేసుకున్నందుకు రెస్టారెంట్ వారికి ధన్యవాదాలు తెలిపింది. 
 

రెస్టారెంట్ లోని రుచికరమైన ఫుడ్, కాక్ టేయిల్స్, అదిరిపోయే మ్యూజిక్ అద్భుతమంటూ చెప్పుకొచ్చింది. రెస్టారెంట్ లో ఫోజులిచ్చిన ఫోటోలను, డాన్స్ చేస్తున్న ఓ వీడియోను సైతం ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

మరోవైపు శ్రద్ధా దాస్ గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. స్లీవ్ లెస్ మనీ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. రెస్టారెంట్ విద్యుదీపాల వెలుతురులో మరింతగా వెలిగిపోతోంది. దీంతో ఆమె బ్యూటీకి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 

ప్రస్తుతం శ్రద్ధా దాస్ తన కేరీర్ ను గాడీన పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. బుల్లితెరపై Dhee 15 షోతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది. అలాగే  ఆయా చిత్రాలు, వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది. రీసెంట్ గా ‘ఖాకీ : ది బిహార్ ఛాప్టర్’తో అలరించింది.
 

Latest Videos

click me!