సమంత స్టన్నింగ్ లుక్ కు మిల్క్ బ్యూటీ తమన్నా ఫిదా.. స్టైలిష్ అవుట్ ఫిట్ లో సామ్ కిల్లింగ్ పోజులు..

First Published | Mar 24, 2023, 6:45 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన సినిమాల రిలీజ్ ల సందర్భంగా సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేస్తోంది.  
 

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ Shaakuntalam. స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. పురాణాల్లోని ప్రేమ కథ ఆధారంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే నెలలో రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. 
 

రీసెంట్ గా పెద్దమ్మతల్లి టెంపుల్ వద్ద సమంతతో పాటు శాకుంతలం టీమ్ మొత్తం అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ప్రమోషన్స్ ను గట్టిగా స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా సమంత అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది.


ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపించే సమంత.. లేటెస్ట్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. స్టైలిష్ గా మెరిసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఈ ఫొటోలు పంచుకుంటూ ఏప్రిల్ 14న చిత్రం విడుదల కాబోతుందంటూ గుర్తుచేసింది కూడాను. ఏదేమైనా ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
 

సమంత స్టన్నింగ్ లుక్ కు ఫ్యాన్స్, నెటిజన్లతో పాటు మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) కూడా ఫిదా అయ్యింది. సామ్ పోస్ట్ చేసిన ఫొటోలపై వెంటనే కామెంట్ చేసింది. కామెంట్ సెక్షన్ లో మూడు ఫైర్ ఎమోజీలను వదిలింది. సమంత లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంటూ వర్ణించింది. మరోవైపు వెన్నెల కిషోర్ కూడా ఫైర్ అండ్ హార్ట్ ఎమోజీలను వదిలారు. 
 

లేటెస్ట్ ఫొటోల్లో సమంత స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ స్లీవ్ బ్లేజర్, లూజ్ ఫిట్ పాయింట్ ధరించి నయా లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు అట్రాక్టీవ్ జ్యూవెల్లరీ, సన్ గ్లాసెస్, బ్రాండెడ్ షూస్ ధరించింది. తన హెయిర్ స్టైయిల్, స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకుంది. 
 

మరోవైపు బ్లేజర్ పై రెండు బటన్స్ విప్పేసి గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. కిల్లింగ్ పోజులతో పాటు ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. శాకుంతలంతో పాటు ‘ఖుషి’, ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ సిరీస్ లోనూ సమంత నటిస్తూ బిజీగా ఉన్నారు.
 

Latest Videos

click me!