మెగా హీరోలకు జోడీగా సాక్షి వైద్య.. ఏకంగా పవన్ సినిమాలో యంగ్ బ్యూటీకి ఛాన్స్.!

First Published | Aug 23, 2023, 12:55 PM IST

యంగ్ బ్యూటీ సాక్షి వైద్య తొలిచిత్రం ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోయినా.. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలింది. మెగా హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. 
 

ముంబై బ్యూటీ, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya)  తెలుగులో మంచి ఆఫర్లు అందుకుంటోంది. ‘ఏజెంట్’ మూవీతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.  సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. 
 

దాంతో సాక్షికి తెలుగులో వరుస అవకాశాలు అందుతున్నాయి. ఏజెంట్ తర్వాత సాక్షి వైద్య నటిస్తున్న చిత్రం ‘గాంఢీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna).  వరుణ్ తేజ్ హీరోగా పవర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో సాక్షి బిజీగా ఉంది. 
 


ఇదిలా ఉంటే.. సాక్షికి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. రీసెంట్ ఇంటర్వ్యూలో సాక్షిని ఆ విషయం బయటపెట్టడం విశేషం. యంగ్ బ్యూటీకి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటించే ఛాన్స్ దక్కింది. ఒక్క సినిమాతోనే ఇలాంటి అవకాశం సొంతం చేసుకుంది. 

హరీశ్ శంకర్ - పవన్ కళ్యాణ్ సెకండ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్నచిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే ఈ చిత్రంతో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండో హీరోయిన్ గా సాక్షి వైద్య కూడా నటిస్తున్నట్టు తెలిసింది. 
 

సెప్టెంబర్ 5 నుంచి ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్ లో సాక్షి వైద్య కూడా పాల్గొనబోతుందంట. ఈ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ మరింత స్పీడ్ అందుకోనుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
 

మరోవైపు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ (Sai Dharam Tej)  సరసన కూడా సాక్షికి అవకాశం అందినట్టు తెలుస్తోంది. రాబోయే చిత్రంలో తేజూ సరసన వెండితెరపై అలరించనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పక్కా అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇలా యంగ్ బ్యూటీ సాక్షి వైద్య మెగా హీరోల సినిమాలతో సందడి చేయబోతోంది. 
 

Latest Videos

click me!