Actress Riythvika: గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ‘మద్రాస్’ నటి, బిగ్‌బాస్ ఫేమ్ రిత్విక.. తన పెళ్లి ఆగిపోయినట్లు తాజాగా ధృవీకరించింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు.
రిత్విక 'పరదేశి' సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'సందిత్తుమ్ సిందిత్తుమ్', 'నినైతు యారో', 'మద్రాస్' వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా 'మద్రాస్' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది.
24
బిగ్‌బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్
రిత్విక అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 2లో పాల్గొని టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తర్వాత సినిమా అవకాశాలు వస్తాయని ఆశించినా, ఆమెకు నిరాశే ఎదురైంది. హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా విజయం సాధించలేదు.
34
లక్ష్మణన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం
33 ఏళ్ల రిత్వికకు గతేడాది వినోద్ లక్ష్మణన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీ ప్రకటించిన తర్వాత, వ్యక్తిగత కారణాల వల్ల వివాహం ఆగిపోయిందని, త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని అప్పట్లో తెలిపారు.
ఏడాది దాటినా పెళ్లి గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో, ఓ అభిమాని "మీ పెళ్లిలో ఏమైనా సమస్యా?" అని ప్రశ్నించాడు. దానికి రిత్విక "అనుకున్నది జరగలేదు" అని సమాధానమిచ్చి, తన పెళ్లి ఆగిపోయిందని చెప్పకనే చెప్పింది. దీనికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.