Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్ డే.. అలా మొదలై వెయ్యి కోట్ల ప్రాజెక్ట్స్ వరకు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్

First Published | Apr 5, 2023, 12:54 PM IST

ఇవ్వాళ నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పుట్టిన రోజు. నేటితో మరో బ్లాక్ బాస్టర్ ఇయర్ లోకి అడుగుపెట్టింది మన శ్రీవల్లి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 

కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన సుమన్ - మదన్ మందన్న దంపతులకు 1996 ఏప్రిల్ 5న రష్మిక మందన్న జన్మించింది. నేటితో 27వ ఏటా అడుగుపెట్టింది. రష్మిక కొడగులోనే తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య  ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేసింది. బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా పొందింది. 
 

రష్మిక మందన్న కాలేజ్ చదువుతుండగా ‘ఫ్రెష్ ఫేస్’ కాంపిటీషన్ లో పాల్గొంది. 2014లో బెంగళూరులోని టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత నుంచి నటిగా అవకాశాల కోసం ప్రయత్నించింది. 10కిపైగా ఆడిషన్స్ ఇచ్చింది. తను ఇంటర్మీడియేట్ లో ఉండగా.. ‘కిర్రాక్ పార్టీ’లో అవకాశం దక్కింది. ఈ చిత్రంలో రక్షిత్ - రష్మిక జంటగా నటించారు. కన్నడలో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్స్ారా నూ అవార్డు అందుకుంది.  


అలా మొదలైన రష్మిక మందన్న కేరీర్ లో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులోకి ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప : ది రైజ్ తో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. అటు కన్నడ, తమిళం, బాలీవుడ్ లోనూ బడా హీరోల సరసన నటిస్తూ కేవలం ఆరేండ్లలోనే అగ్రస్థాయి  హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 
 

ప్రస్తుతం నేషనల్ క్రష్ చేతిలో అన్ని చిత్రాలకు కలుపుకొని రూ.1000 కోట్లతో రూపుదిద్దుకుంటున్న Animal, Pushpa The Rule, తదితర చిత్రాలు ఉన్నాయి. ఈ భారీ చిత్రాల్లో రష్మిక మందన్న భాగమవడం ఆమె అభిమానులకు గొప్ప  విషయమనే చెప్పాలి. తక్కువ సమయంలో ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. 
 

ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా మారిపోయింది. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం యానిమల్, పుష్ప : ది రూల్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న  VNRTrio, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తోంది. అన్నీ చిత్రాలు చకాచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. 

ఈరోజు రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప : ది రూల్’ నుంచి ఫస్ట్ లుక్ గా బర్త్ డే పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే VNRTrio నుంచి కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటోంది. ఇక నేషనల్ క్రష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సీడీపీ పోస్టర్లతో నెట్టింట విషెస్ తెలుపుతున్నారు.  పలువురు సెలెబ్రెటీలు సైతం రష్మికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Videos

click me!