అవుట్ ఫిట్ అదిరింది.. టైట్ డ్రెస్ లో రకుల్ కిర్రాక్ పోజులు.. ‘బిగ్ బాస్’ కోసం ఢిల్లీ బ్యూటీ మెరుపులు

First Published | Jun 25, 2023, 2:17 PM IST

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  సండే ట్రీట్ అదరగొట్టింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ రచ్చ చేస్తున్న రకుల్ లేటెస్ట్ ఫొటోషూట్ తో మతులు పోగొట్టింది. కిర్రాక్ ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతోంది. వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ కిర్రాక్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

రకుల్ వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాప్ ఇవ్వకుండా గ్లామర్ లుక్స్ లో మెరుస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా సండే ట్రీట్ అదరగొట్టింది. బ్లూ టైట్ ఫిట్ లో ఢిల్లీ భామ మెరుపులు మెరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది.
 


వన్ షోల్డర్ గౌన్ లో రకుల్ గ్లామర్ మెరుపులు మెరిపించింది. అలాగే థైస్ అందాలతోనూ మతి చెడగొట్టింది. ఖతర్నాక్ స్టిల్స్ తో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరించిన తర్వాత మరింతగా అందాలను ఆరబోస్తోంది. బ్యాక్ టు బ్యాక్ నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

అయితే, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా జూన్ 17 నుంచి ప్రారంభమైన ‘బిగ్ బాస్ ఓటీటీ‘ సీజన్ 2’లో రకుల్ జాయిన్ అయ్యారు. ‘వీకెండ్ కా వార్’ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకోసం స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో రకుల్ అట్రాక్టివ్ లుక్ లో రెడీ అయ్యారు. ఈ సందర్బంగా ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంది.
 

వరుసగా రకుల్ గ్లామర్ విందు చేస్తూ తన అభిమానులకు మరింతగా దగ్గరవుతూనే వస్తోంది. సినిమాల పరంగా ఇటీవల పెద్దగా సక్సెస్ లేకపోయినా సోషల్ మీడియాలో తరుచూగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక రకుల్ ప్రస్తుతం సౌత్ సినిమాలపైనే ఫోకస్ చేశారు. గతేడాది హిందీలో వచ్చిన నాలుగైదు చిత్రాలు పెద్దగా సక్సెస్ అందించకపోవడంతో మళ్లీ దక్షిణాదిపై చూస్తోంది.
 

ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ‘ఇండియన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. రకుల్ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇదొక్కటే. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కాజల్, రకుల్ హీరోయిన్లుగా అలరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. అలాగే తమిళ స్టార్ శివకార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. 

Latest Videos

click me!